- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : పేపర్ లీకేజీలకు చెక్ పెట్టనుంది ప్రభుత్వం. ప్రతిఏటా ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఎక్కడో ఒకచోట పేపర్ లీక్ అవడం ఇంటర్ బోర్డుకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకేజీలను ఆపలేకపోతోంది. అయితే ఇకపై ఎలాంటి లీకేజీలకు తావు లేకుండా ఇంటర్ బోర్డు సాంకేతిక టెక్నాలజీతో సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇంటర్ క్వశ్చన్ పేపర్లకు GPS ట్రాకింగ్ ఏర్పాటు చేయనుంది. ప్రింటింగ్ నుంచి ఎగ్జామ్ సెంటర్ వరకు పేపర్లను చేరవేసే వాహనాలకు GPRS ఏర్పాటు చేయనుంది.
క్వశ్చన్ పేపర్, బుక్ లెట్ మీద ముద్రించే ప్రత్యేక కోడ్ వలన పేపర్ ను ఎక్కడ స్కాన్ చేసినా ఆ సమాచారం వెంటనే బోర్డుకు తెలిసిపోతుంది. కాగా ఈసారి నీటిలో తడిసినా పాడవని బుక్ లెట్లు ఇస్తారని తెలుస్తోంది. అలాగే ఇంటర్ రెండవ సంవత్సరం హాల్ టికెట్ పై ఫస్ట్ ఇయర్ మార్కులు కూడా ప్రింట్ చేస్తునట్టు సమాచారం.






