- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్ని సార్లు చెప్పినా మారరా..! హైడ్రా పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
హైడ్రా (Hydra) వీకెండ్ కూల్చివేతలపై (Weekend Demolitions) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్ డెస్క్: హైడ్రా (Hydra) వీకెండ్ కూల్చివేతలపై (Weekend Demolitions) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క రోజులో పత్రాలు సమర్పించడం ఎలా సాధ్యమని హైడ్రాపై సీరియస్ (Serious) అయ్యింది. తన ఆస్తులను అక్రమంగా కూల్చివేశారని అబ్దుల్లాపూర్ మెట్ మండలం (Abdullapur Met Mandal) కోహెడ గ్రామానికి (Koheda Village) చెందిన సామ్‌రెడ్డి బాల్ రెడ్డి (Samreddy Balreddy) అనే వ్యక్తి హైకోర్టులో ఆదివారం హౌజ్ మోషన్ పిటిషన్ (House Motion Pitition) దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ కె. లక్ష్మణ్ (Justice K. Lakshman) హైడ్రా ఆదివారం కూల్చివేతలపై ఫైర్ అయ్యారు. ఎన్ని సార్లు చెప్పినా మీరు మారరా అని, శుక్రవారం నోటీసులు ఇచ్చి, ఆదివారం కూల్చివేతలు చేయడం ఏంటని ప్రశ్నించింది.
అంతేగాక ఒక్కరోజులో పత్రాలు సమర్పించడం ఎలా సాధ్యం అవుతుందని వ్యాఖ్యానించింది. ఇక సెలవు దినాల్లో (Holydays) కూల్చివేతలు (Demolitions) చేపడితే కఠిన చర్యలు (Strict Actions) తప్పవని హైడ్రాకు హెచ్చరికలు (Warning) జారీ చేసింది. కాగా 170 మంది ప్లాట్ ఓనర్స్ (Plot Owners).. కోహెడ గ్రామంలో సర్వే నెంబర్ 951, 952 లోని 7.258 గుంటల భూమిని ఓ రియల్టర్ (Realter) కబ్జా చేసి ఫాంహౌజ్ నిర్మించుకున్నారని హైడ్రా ఆఫీసులో (Hydra Office) జరిగే ప్రజావాణి కార్యక్రమంలో (Praja Vani Programme) ఫిర్యాదు (Complaint) చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. కోహెడ ప్లాట్ ఓనర్స్ ఫిర్యాదు పై విచారణ చేపట్టి, కబ్జా చేసిన రియల్టర్ కు నోటీసులు ఇచ్చారు. దీనిపై స్పందన రాకపోవడంతో ఆదివారం భారీ పోలీసు బందోబస్తు నడుము కూల్చివేతలు నిర్వహించింది.






