- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెక్యూరిటీ, పార్కింగ్‌కు నో ప్రాబ్లమ్.. ఇక ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ నుంచే సీఎం సమీక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకపై తన సమీక్షలు, సమావేశాలను ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ (MCRHRD)లోని కొత్త భవనం నుంచి నిర్వహించనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇకపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం(ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ) నుంచి సమీక్షలు, సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు సచివాలయంతో పాటు పోలీస్ కమాండ్ కంట్రోల్‌సెంటర్‌లో కీలక సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ప్రారంభించిన భవనం పనులు ఎట్టకేలకు పూర్తి అయ్యాయి. ఇటీవలే ఆ భవనాన్ని ఎటువంటి హడావుడి, హంగామా లేకుండా ప్రారంభించారు. గతవారం రోజులుగా సీఎం రేవంత్అక్కడి నుంచే సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమీక్షకు విశాలమైన కాన్ఫరెన్స్ హాల్‌ను నిర్మించారు. తక్కువ సంఖ్యలో అధికారులు ఉన్నప్పుడు చిన్న హాల్స్, సీఎం కూర్చోవడానికి విశాలమైన గది, వెయిటింగ్ హాల్స్, సీఎం సమీక్షలు, సమావేశాలకు అనువుగా దీనిని నిర్మించారు. దీంతో సీఎం ఇక్కడి నుంచే సమీక్షలు ప్రారంభించారు. మర్రి చెన్నారెడ్డి మావనవనరుల కేంద్రంలో పార్కింగ్‌కు విశాలమైన స్థలం అందుబాటులో ఉంది. ఎంత మంది అధికారుల వాహనాలు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్చేయవచ్చు.
సెక్యూరిటీ, పార్కింగ్‌కు నో ప్రాబ్లమ్..
ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ భవనంలో సీఎం సమీక్షలు చేస్తే అక్కడికి వచ్చే వారి వాహనాలతో ఎవరికీ ట్రాఫిక్ సమస్యలు ఉండవు. ఆ భవనానికి ప్రహరీ, సెక్యూరిటీ ఉండటంతో ఎవరు పడితే వారు లోనికి వచ్చే అవకాశం లేదు. అన్ని రకాలుగా అనువుగా ఉండటం, సీఎం సెక్యూరిటీ, కాన్వాయ్, ఆంక్షల వలన ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని గుర్తించి అక్కడ సమీక్షలు చేసేందుకు సీఎం సుముఖత వ్యక్తంచేసినట్టు తెలిసింది. సీఎం ఇంటి నుంచి ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ భవనానికి తక్కువ దూరం ఉండటంతో సీఎం జర్నీ సమయంలోనూ ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం ఉండదు. గతంలో బీఆర్ఎస్అధికారంలో ఉన్న సమయంలో బేగంపేటలో నిర్మించిన ప్రగతి భవన్ ప్రస్తుత ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి నివాసం ఉంటున్నారు. ఇతర భవనాలను ప్రజావాణికి, ఇతర సమీక్షలకు వాడుకుంటున్నారు. దీంతో సీఎం రేవంత్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. అక్కడ కూడా సౌకర్యాలు సరిగా లేకపోవడం వల్లే కొత్త భవన నిర్మాణం చేపట్టారు. ఇటీవలే అది పూర్తి అయింది. అందుకే ఇకమీదట అక్కడి నుంచే సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ భవనంలోని సౌకర్యాలపై అధికారులు, పోలీసులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ కొన్ని సందర్భాల్లో ఇంటి నుంచే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అధికారులకు పార్కింగ్, ఇతర సెక్యూరిటీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇకమీదట ఇటువంటి సమస్యలకు ఇబ్బంది ఉండదని అంతా భావిస్తున్నారు.






