తాండూరు బీఆర్ఎస్ మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం

by Disha Web Desk 2 |
తాండూరు బీఆర్ఎస్ మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం
X

దిశ, వెబ్‌డెస్క్: తాండూరు బీఆర్ఎస్ మున్సిపల్ చైర్‌పర్సన్‌‌కు కౌన్సిలర్లు భారీ షాకిచ్చారు. చైర్‌పర్సన్‌ స్వప్న పరిమళపై కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎమ్, టీజేఎస్‌కు చెందిన దాదాపు 23 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టారు. కాగా, మరోపక్క జవహర్ నగర్ మేయర్ మేకల కావ్యపై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం చేస్తూ నోటీసును కలెక్టర్ కార్యాలయంలో అందజేసిన విషయం తెలిసిందే. పార్టీ వీప్‌ను లెక్కచేయకుండా అవిశ్వాస తీర్మాన సమావేశం పెట్టడమే కాకుండా ఏకంగా జీహెచ్‌ఎంసీ చట్టం 1955 అనుసరించి 91 ఏ సెక్షన్ ప్రకారం 20 మంది కార్పొరేటర్లు సంతకం చేసిన పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో శనివారం అందించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే తాండూరు బీఆర్ఎస్ మున్సిపల్ చైర్‌పర్సన్‌‌కు కౌన్సిలర్లు అనూహ్య షాకివ్వడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Next Story