Seethakka: అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారంపై రాజీపడేది లేదు: మంత్రి సీతక్క

by Prasad Jukanti |

అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారంపై రాజీపడేది లేదని మంత్రి సీతక్క అన్నారు.

Seethakka: అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారంపై రాజీపడేది లేదు: మంత్రి సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: అంగన్ వాడీ కేంద్రాల్లో పోషకాహారం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి సీతక్క (Seetakka) స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాల్లోని అంగన్వాడీలకు సైతం ప్రతిరోజు పాల సరఫరా జరగాల్సిందేనన్నారు. శనివారం సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై (wdcw) మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలకు పాలు, పప్పు వంటి వస్తువుల సరఫరా, ఏజెన్సీల పనితీరుపై సమీక్షించారు. కొన్ని ప్రాంతాల్లో సరఫరాలో గ్యాప్ ఉండటం పట్ల మంత్రి సీతక్క ఆగ్రహం చేశారు. అంగన్వాడి కేంద్రాలకు (AnganWadi Centres) సరిపడ స్థాయిలో పాలు సరఫరా చేయగలరా? లేదా? అని ప్రశ్నించారు. ఈ మీటింగ్ కు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, పలువురు జిల్లా సంక్షేమ అధికారులు, విజయ డెయిరీ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story