- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్‌పై కవిత కీలక వ్యాఖ్యలు.. కేడర్‌కు బీఆర్ఎస్ కీలక ఆదేశాలు!
భారీ జనం మధ్య శనివారం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీని ప్రకటించారు. అయితే.. పార్టీ ఆవిర్భావ సభలో ఆద్యంతం ఆమె తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌నే టార్గెట్ చేస్తూ ప్రసంగించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: భారీ జనం మధ్య శనివారం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీని ప్రకటించారు. అయితే.. పార్టీ ఆవిర్భావ సభలో ఆద్యంతం ఆమె తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌నే టార్గెట్ చేస్తూ ప్రసంగించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఆయన తెలంగాణకు మేలు చేయలేదని.. ఆయనో మరమనిషి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల నుంచి మాత్రం స్పందన కరువైంది. ఉదయమే సభ ముగిసినప్పటికీ రాత్రి వరకు ఏ ఒక్క బీఆర్ఎస్ నేత కవిత కామెంట్స్‌పై స్పందించలేదు.
అధిష్టానం నుంచి ఆదేశాలు..
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. కవిత వ్యాఖ్యలపై ఎవరూ స్పందించొద్దని అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. మీడియా ముందు కానీ, సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై చర్చకు దూరంగా ఉండాలని కేడర్‌కు సూచించినట్లు తెలిసింది. ఈ మౌనం వెనక వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తే ఆమెకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని, అందుకే పట్టించుకోకుండా ఉండాలని పార్టీ నిర్ణయించినట్లు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, అంతర్గతంగా పరిస్థితిని సమీక్షిస్తూ సరైన సమయానికి స్పందించాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ వర్గాల్లో మాత్రం మరో చర్చ నడుస్తున్నది. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ రజతోత్సవాల ముగింపు పేరిట నిర్వహిస్తున్న ఈ సమావేశానికి కేసీఆర్ సైతం హాజరవుతున్నారు. అయితే.. ఈ సమావేశంలో అధినేత కేసీఆర్ స్వయంగా ఈ అంశంపై స్పందించే అవకాశం ఉన్నదని నాయకులు అంటున్నారు. ఆ సమావేశంలో పార్టీ భవిష్యత్ వ్యూహంతోపాటు కవిత వ్యవహారంపైనా క్లారిటీ వచ్చే అవకాశమున్నదని భావిస్తున్నారు.






