- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR ఫోన్.. కొత్తగూడెం మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని సీపీఐ ప్రకటన
గులాబీ పార్టీ, కమ్యూనిస్టుల మధ్య పొత్తు పొడిచినట్లేనా ? అని ప్రచారం సాగుతోంది. కొత్తగూడెంలో బీఆర్ ఎస్, సీపీఐ రెండు కలిసి మేయర్ దక్కించుకోనే ఛాన్స్ ఉంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి నిన్నటితో ముగిసింది. ఇక ఇప్పుడు మున్సిపల్ చైర్ పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్ల పదవులను భర్తీ చేయడంపై ఫోకస్ చేశాయి పార్టీలు. కొన్ని వార్ వన్ సైడ్ కాగా.. మరికొన్ని హంగ్ ఏర్పడ్డాయి. ఇందులో కొత్తగూడెం కార్పొరేషన్ కూడా ఉంది. ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ పార్టీలకు సమానంగా సీట్లు వచ్చాయి. కచ్చితంగా ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ లేదా సీపీఐ మేయర్ పదవి దక్కించుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక ప్రకటన చేశారు.
గులాబీ పార్టీ, కమ్యూనిస్టుల మధ్య పొత్తు పొడిచినట్లేనా ?
కొత్తగూడెంలో మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని సంచలన ప్రకటన చేశారు సీపీఐ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఇప్పటికే గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తనకు కాల్ చేసి, BRS తరఫున మద్దతు ప్రకటించినట్లు స్పష్టం చేశారు. ఇండిపెండెంట్ ల మద్దతు కూడా ఉందని వివరించారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి చర్చ చేయలేదని వివరణ ఇచ్చారు సాంబశివరావు. మేయర్ పదవి గిరిజనులకే ఇస్తామని ప్రకటించారు. ఇది ఇలా ఉండగా ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీకి 22 సీట్లు దక్కాయి. సీపీఐ పార్టీకి 22 రాగా గులాబీ పార్టీకి 8 సీట్లు దక్కాయి. ఇటు ఇండిపెండెంట్ లు ఆరుగురు గెలిచారు. బీజేపీ అటు సీపీఎం తలో చోట గెలిచాయి. ఇది ఇలా ఉండగా, కేటీఆర్ కూడా కొత్తగూడెంలో సీపీఐకి ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించారు. మద్దతు ప్రకటించారు.






