టీ కాంగ్రెస్‍లో సస్పెన్స్ కంటిన్యూ.. రాజ్యసభ అభ్యర్థులపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-03-03 09:50:32  IST  )

తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యసభ రేసులో ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడే చెప్పలేమని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

టీ కాంగ్రెస్‍లో సస్పెన్స్ కంటిన్యూ..  రాజ్యసభ అభ్యర్థులపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‍లో (Telangana Congress) రాజ్యసభ (Rajya Sabha) టికెట్ల కోసం ఆశావహుల మధ్య పోటీ బాగా పెరిగింది. నామినేషన్లకు ఆఖరి గడువు (మార్చి5) ముంచుకొస్తున్నా అభ్యర్థుల ఎంపికపై పార్టీ ఇంకా కసరత్తు చేస్తోంది. నిన్న రాహుల్ గాంధీ పర్యటనలో అభ్యర్థుల విషయంలో క్లారిటీ వస్తుందని భావించినా అలా జరగలేదు. నిన్న ఎయిర్ పోర్టులో రాహుల్‍తో జరిగిన భేటీలో రాజ్యసభ అభ్యర్థులపై క్లారిటీ రాలేదని పీసీసీచీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. మంగళవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై స్పందించారు. ఈ విషయంలో మరోసారి చర్చిస్తామని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు. రేసులో ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడే చెప్పలేమని, అన్ని సమీకరణాలను బేరీజు వేసుకున్న తర్వాతే రాజ్యసభ అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేస్తుందని స్పష్టం చేశారు.

రేపు అభ్యర్థుల ప్రకటన!:

రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల విషయంపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఖరారుపై చర్చించేందుకు రేపు (బుధవారం) రాష్ట్ర నాయకత్వం ఢిల్లీకి వెళ్లపోతున్నట్లు తెలుస్తోంది. ఆ రోజున అభ్యర్థులను ఖరారు చేద్దామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీవేణుగోపాల్ రాష్ట్ర నాయకత్వానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Next Story