- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ నుంచి నో ఛాన్స్.. విష్ణువర్ధన్ రెడ్డి రియాక్షన్ ఇదే..!
కాంగ్రెస్ శుక్రవారం విడుదల చేసిన సెకండ్ లిస్టులో జూబ్లీహిల్స్ స్థానం నుంచి అజరుద్దీన్ కు చోటు కల్పించిన విషయం తెలిసిందే

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ శుక్రవారం విడుదల చేసిన సెకండ్ లిస్టులో జూబ్లీహిల్స్ స్థానం నుంచి అజరుద్దీన్ కు చోటు కల్పించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి టికెట్ ఆశించిన దివంగత నేత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి తాజాగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో తాను జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తా అన్నారు. హాఫ్ టికెట్ గాళ్లకు కాంగ్రెస్‌లో టికెట్లు ఇచ్చారన్నారు. ఒకే ఇంట్లో చాలా మందికి టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్‌లో ఒక్కసారిగా అజారుద్దీన్ పేరు తెరపైకి వచ్చిందన్నారు. సిటీలో ఒకే సీటు కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు స్పష్టం చేశాయని.. ఇప్పుడు ఆ ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం పోయిందన్నారు. కార్యకర్తలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు.
Next Story






