- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుమంత్ పై కేసు నమోదు చేయలేదు.. ఓఎస్డీ ఎపిసోడ్ పై క్లారిటీ ఇచ్చిన పోలీసులు
అవినీతి, సెటిల్మెంట్లలో కలగజేసుకున్నాడని ఆరోపణలు రావడంతో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న ఎన్.సుమంత్‌పై ప్రభుత్వం వేటు వేయడం సంచలనంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: అవినీతి, సెటిల్మెంట్లలో కలగజేసుకున్నాడని ఆరోపణలు రావడంతో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న ఎన్.సుమంత్‌పై ప్రభుత్వం వేటు వేయడం సంచలనంగా మారింది. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. విధుల నుంచి తొలగించబడిన సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు (Task Force Police) మఫ్టీలో మంత్రి ఇంటికి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
కాగా మంత్రి ఓఎస్డీ ఎపిసోడ్ పై హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) క్లారిటీ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్ (Sumanth)పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయనతో మూడు రోజులుగా మాట్లాడేందుకు ప్రయత్నించామని తెలిపారు. తీవ్ర ఆరోపణలు ఉన్నప్పటికి మంత్రి OSD కావడంతో పర్సనల్ గా మాట్లాడేందుకే మంత్రి నివాసానికి వెళ్లామని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. అలాగే సుమంత్ పై ఆరోపణలు వచ్చినప్పటికి ఇంత వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని, అతను అందుబాటులోకి వస్తే.. అతనిపై వచ్చిన ఆరోపణలపై మాత్రమే విచారణ చేస్తామని ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
Read More..
నాకు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు.. కొండా మురళి కీలక వ్యాఖ్యలు






