- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విస్మరిస్తే మరో సకల జనుల సమ్మె చూస్తారు.. ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ హెచ్చరిక
డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రభుత్వం చర్చలకు ముందుకు రాకపోతే బస్సులు నిలిపివేస్తామని హెచ్చరించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాటపడుతున్న వేళ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు దిగితే తమ ప్రణాళికలు తమకు ఉన్నాయని బస్సులు ఎలా తిరుగుతాయో మోము చూస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నేసిన ప్రభుత్వం కావాలనే కార్మికులు సమ్మెవైపు వెళ్లేల చేస్తోందని ఆరోపించారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదని ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపకపోవడం విచారకరం అన్నారు. మంగళవారం అర్ధరాత్రి (ఏప్రిల్ 21 అర్ధరాత్రి) నుంచే సమ్మెకు వెళ్లేందుకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం ఉదయం హైదరాబాద్‍లో ఆర్టీసీ జేఏసీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న.. ఆర్టీసీ సమ్మెకు ప్రజాసంఘాల మద్దతు ప్రకటించాయని మేము సమ్మెబాట పడితే ఇది మరో సకల జనుల ఆర్టీసీ సమ్మెగా మారుతుందని హెచ్చరించారు. సబ్బండ వర్గాలు మా వెనుక నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.
మా డోర్లు తెరుచుకునే ఉన్నాయి:






