చెడు వ్య‌స‌నాల‌కు యువ‌త దూరంగా ఉండాలి : సీపీ పోత‌రాజు సాయి చైత‌న్య

by Ratna Kumari |

సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందిన కానిస్టేబుల్ ప్రమోద్ స్మృతికి అంకితంగా ఈ ఫుట్ ‌బాల్ టోర్నమెంట్‍ను నిర్వహించడం అత్యంత గర్వకారణంగా ఉందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య అన్నారు.

చెడు వ్య‌స‌నాల‌కు యువ‌త దూరంగా ఉండాలి : సీపీ పోత‌రాజు సాయి చైత‌న్య
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందిన కానిస్టేబుల్ ప్రమోద్ స్మృతికి అంకితంగా ఈ ఫుట్ ‌బాల్ టోర్నమెంట్‍ను నిర్వహించడం అత్యంత గర్వకారణంగా ఉందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య అన్నారు. మూడు నెలల క్రితం విధి నిర్వహణలో ఉండగా అక్టోబర్ 17 న రౌడీ షీటర్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ జ్ఞాపకార్ధం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుట్ బాల్ టోర్నమెంట్ ను ఆదివారం సీపీ ప్రారంభించారు. ముందుగా ప్రమోద్ కుమార్ చిత్రపటానికి సీపీ పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నిజామాబాద్ యువతను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఫుట్ బాల్ టోర్నమెంట్ ను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల భద్రత, వారి రక్షణ కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ప్రమోద్ త్యాగం మనందరికీ చిరస్మరణీయమని సీపీ అన్నారు. ఆయన సేవలు, ధైర్యసాహసాలు పోలీస్ విభాగానికి మాత్రమే కాదు , సమాజానికి కూడా ఆదర్శప్రాయమేనన్నారు.

చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి..

చెడు వ్యసనాలకు బానిసలుగా మారి యువత తన భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోవద్దని సీపీ అన్నారు. ఈ మధ్యకాలంలో మారుమూల గ్రామాల్లో యువత డ్రగ్స్ ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు యువత కోసం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో క్రీడలను నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సే నో టు డ్రగ్స్ , సే ఎస్ టు స్పోర్ట్స్ అనే నినాదాన్ని యువతకు తెలియజేస్తున్నామన్నారు. గత వారంలో ప్రారంభమైన అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రజల భద్రత రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నియమాలను, ప్రమాద నివారణ సూచనలు గురించి ప్రస్తావించారు. మన తోటి పౌరుల, కుటుంబ సభ్యుల భవిష్యత్తు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తగిన ప్రభుత్వం, పోలీసు వారు సూచించిన నియమాలు జాగ్రతలు పాటించాలి.

కోవిడ్ మరణాల కన్నా రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువ..

జిల్లాలో 2020 , 2021 లో చోటు చేసుకున్న కోవిడ్ మరణాలకన్నా గతేడాదిలో జరిగిన రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని సీపీ సాయిచైతన్య అన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా అవగాహనా కల్పించుకొని తాము, తమ కుటుంబ సభ్యులు, తోటి స్నేహితులు, తోటి ఉద్యోగులు, విద్యార్థులు, యువత కంకణం కట్టుకోవాలి. పోలీసు శాఖ కూడా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా గట్టి చర్యలు తీసుకోవటం జరుగుతుందని సీపీ అన్నారు. కార్యక్రమంలో ప్రమోద్ కుమార్ కుటుంబ సభ్యులు, అడిషనల్ పోలీస్ కమిషనర్ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి, నిజామాబాద్ఏసీపీ ఎల్. రాజా వెంకట్ రెడ్డి , బోధన్ ఏసీపీ శ్రీనివాస్, జిల్లా ఫుట్ బాల్ ప్రెసిడెంట్ మీర్ ఫారూఖ్ అలీ , జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ పవన్ కుమార్ , జిల్లా రంజీ క్రికెట్ ప్లేయర్ అంకిత్ రెడ్డి , ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ జావీద్ , జాయింట్ సెక్రెటరీ మసూద్ , కోచ్ నాగరాజు టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ మరియు జిల్లాలోని సీఐలు, ఎస్ఐ లు ఫుట్ బాల్ క్రీడాకారులున్నారు.

Next Story