యువత గంజాయికి బానిసలై చెడు మార్గం పట్టవద్దు : ఈఆర్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ ఈరవత్రి రాజశేఖర్

by Ratna Kumari |

దిశ, ఆర్మూర్ : సమాజంలో యువత గంజాయికి బానిసలై చెడు మార్గం పట్టవద్దని.. యువతను సక్రమ మార్గంలో నడిపించే పూర్తి బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాల‌ని సూచించారు. గంజాయి మహమ్మారిని తరిమి

యువత గంజాయికి బానిసలై చెడు మార్గం పట్టవద్దు : ఈఆర్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ ఈరవత్రి రాజశేఖర్
X

దిశ, ఆర్మూర్ : సమాజంలో యువత గంజాయికి బానిసలై చెడు మార్గం పట్టవద్దని.. యువతను సక్రమ మార్గంలో నడిపించే పూర్తి బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాల‌ని సూచించారు. గంజాయి మహమ్మారిని తరిమి కొట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి తరిమికొట్టాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ కోరారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెరికిట్ కోటార్ మోర్ లో సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు పల్లె నరసింహ వారి బృందం ఆధ్వర్యంలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహిస్తున్న,తెలంగాణ ప్రజా నాట్యమండలి బస్సు కళాజాత గత నెల 27 న ప్రారంభమై శనివారం నవంబర్ 1వ తేదీన ఆర్మూర్ కు చేరుకుంది. ఆదివారం వరకు ఆదిలాబాద్ వరకు ప్రజా నాట్యమండలి బస్సు కళాజాత ప్రోగ్రాం చేరుకుంటుంది. ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దు అనే నిదానంతో పెరికిట్ బస్టాండ్ చౌరస్తాలో ఆటపాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ ని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా పల్లె నరసింహ మాట్లాడుతూ యువత డ్రగ్స్ గంజాయి బారినపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారా, యువత చెడు మార్గం వీడి సక్రమార్గంలో నడవాలని, ఈ కార్యక్రమం ద్వారా తమ వంతు కృషి చేస్తున్నా మన్నారు. అనంతరం ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. కొందరు రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి యువతను గంజాయి కి బానిసలను చేస్తున్నారని అన్నారు. యువత గంజాయికి బానిసలై, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టడంలో ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలో యువత చెడు మార్గం వీడి మంచి భవిష్యత్తుకు బాట వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జననాట్య మండలి ప్రతినిధులు, బట్టు శ్రీధర్, నారాయణ, లక్ష్మీనారాయణ, ఈ ఆర్ ఫౌండేషన్ సభ్యులు కుండ రాంప్రసాద్, కొండి రామచంద్ర, నూకల శేఖర్, ఇట్టెం రాంప్రసాద్, మాజీదు ఎంటర్ప్రైజెస్ ఇంతియాజ్, నవీన్, టైలర్ వినోద్, భవాని శ్రావణ్, రాజేశ్వర్ గౌడ్, సాయి చరణ్, ఇట్టేడి సంజీవ్ రెడ్డి, గోరింటాల నరేష్ గౌడ్, లక్కారం అభిషేక్, మందాపురం రాకేష్ గౌడ్ పాల్గొన్నారు.

Next Story