ఆర్మూర్ లో మైన‌ర్ బాలికను వేధించిన యువ‌కులు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-03-17 11:16:14  IST  )

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం లోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో బీసీ వసతి గృహంలో నివాసం ఉంటూ పదో తరగతి చదువుకుంటున్న ఓ మైనర్ బాలికను ట్రాప్ చేసి, ఇబ్బందులకు గురిచేసిన సంఘటన ఆర్మూర్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆర్మూర్ లో మైన‌ర్ బాలికను వేధించిన యువ‌కులు
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో బీసీ వసతి గృహంలో నివాసం ఉంటూ పదో తరగతి చదువుతున్న‌ ఓ మైనర్ బాలికను ట్రాప్ చేసి, ఇబ్బందులకు గురి చేసిన సంఘటన ఆర్మూర్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఆది, షేక్ కైఫ్ అనే ఇద్దరు మైనారిటీ యువకులను ఆర్మూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆలస్యంగా తెలిసింది. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో బీసీ వసతి గృహంలో నివాస‌ముంటూ పదో తరగతి చదువుకుంటున్న ఓ మైనర్ బాలికను ఇద్దరు యువకులు ట్రాప్ చేసి లోబ‌ర్చుకున్నారు. ఈ ఇద్దరు యువకుల్లో ఒకరు ఆర్మూర్ మున్సిపల్ లో ఇటీవల కౌన్సిలర్ గా గెలిచిన ఓ నాయకుడికి స్వయాన మేనల్లుడు అని విశ్వసనీయ సమాచారం. ఇటీవల ఈ ఇద్దరు మైనారిటీ యువకులు పదో తరగతి చదువుకునే మైనర్ బాలికను ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని వీక్లీ మార్కెట్ లో గల ఓ ఓ ఫంక్షన్ హాల్ పక్కన గల కాంప్లెక్స్ లో ఉండే ఒక గదికి తీసుకెళ్లినట్టు స‌మాచారం.

మైనార్టీ యువకుల ప్రవర్తనతో విషయం బయటకు పొక్కిన వైనం

ఆ గదిలోకి మైనర్ బాలికను తీసుకెళ్లిన తర్వాత యువకుల ప్రవర్తనపై ఆ కాంప్లెక్స్ ఇంటి యజమాని భార్యకు అనుమానం వ‌చ్చింది. వెంటనే తన భర్తకు సమాచారం అందించింది. ఆ ఇంటి యజమాని వెంటనే ఇంటికి చేరుకుని.. లోపల ఉన్న ఆ యువకులను నిలదీశారు. వీక్లీ మార్కెట్లోని స్థానికుల సహాయంతో ఆ మైనర్ బాలికను రక్షించి, ఈ విషయం పై ఆర్మూర్ పోలీసులకు సమాచారం అందించారు.

పోలీస్ స్టేషన్ కు తరలివచ్చిన హిందూ సంఘాలు..

ఆర్మూర్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఆ యువకులను పోలీస్ స్టేష‌న్ కి త‌ర‌లించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఆర్మూర్ పట్టణానికి చెందిన బీజేపీ, బజరంగ్ దళ్ హిందూ సంఘాల కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో వసతి గృహంలో ఉంటూ పదో తరగతి చదువుకునే బాధితురాలైన ఆ మైనర్ బాలికకు, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆర్మూర్ ఎస్హెచ్ఓ ఈ సంఘటనకు కారకులైన యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్ కు తరలించినట్టు స‌మాచారం.

వాస్త‌వాలను వెలుగులోకి తెస్తే విలేక‌ర్ల పై కేసులు న‌మోదు చేస్తాం..!

ఆర్మూర్ ప్రాంతంలో మహిళలు, యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారయత్నాలు, ఈవ్‌ టీజింగ్ లపై విలేకరులు జరిగిన వాస్తవాలను వార్తలు రాస్తే కేసులు నమోదు చేస్తామని ఆర్మూర్ పోలీసులు హెచ్చరించారు. ఆర్మూర్ పోలీసులు వాస్తవ సంఘటనలపై విలేకరులు వార్తలు రాస్తే కేసులు నమోదు చేస్తాం అని హెచ్చరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇటీవల ఓ మైనర్ బాలికను వేధించి, లోబర్చుకొని ఇద్దరు యువకులు ఆర్మూర్ లోని వీక్లీ మార్కెట్ ఏరియాలో ఓ గదికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం అంతా తెలిసిన ఆర్మూర్ పోలీసులు ఈ విషయాన్ని విలేకర్లు వార్త రాయవద్దని అలా రాస్తే.. విలేకరులపై కేసులు నమోదు చేస్తామని జరిగిన వాస్తవ సంఘటన గురించి ఇలా మాట్లాడటం పై ఆర్మూర్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. జరిగిన సంఘటన చెప్పాల్సిన పోలీసులే వాటిని చెప్పకుండా ఇంకా మరో తీరుగా బెదిరింపులకు పాల్పడడం పై ఆర్మూర్ ప్రాంతంలోని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story