- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాత్రి నుంచి మీ సేవలు బంద్..!
కొత్తగా తెచ్చిన సాఫ్ట్ వేర్ ను అప్ లోడ్ చేయడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవ కేంద్రాల్లో శుక్రవారం రాత్రి నుంచి అన్ని రకాల సేవలు నిలిచిపోనున్నాయి.

దిశ, భిక్కనూరు : కొత్తగా తెచ్చిన సాఫ్ట్ వేర్ ను అప్ లోడ్ చేయడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవ కేంద్రాల్లో శుక్రవారం రాత్రి నుంచి అన్ని రకాల సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో వివిధ పనుల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లేవారికి సేవలు అందుబాటులో ఉండవు అనే విషయాన్ని మీసేవ నిర్వాహకులు "ప్రజలకు ముఖ్య ప్రకటన" పేరుతో పోస్టర్ ను మీసేవ కేంద్రాల్లో అతికించారు. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా, మీ సేవా కేంద్రాల ద్వారా అందుతున్న అన్ని రకాల సేవలకు తాత్కాలికంగా బ్రేక్ పడుతుందని పేర్కొన్నారు. కొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్ కావడానికి 36 గంటల సమయం పట్టనుండటం, శనివారంతో పాటు, రేపు ఆదివారం సెలవు దినం కావడంతో, మీ సేవలు సోమవారం ఉదయం అందుబాటులోకి రానున్నాయి. తాత్కాలికంగా సేవలు నిలిచిపోతున్నందున, ఈ విషయాన్ని గమనించి, తమకు సహకరించాలని మీసేవ కేంద్రాల నిర్వాహకులు స్టేటస్ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టర్ ను పోస్ట్ చేశారు. దీంతో రెండు రోజుల పాటు మీసేవ కేంద్రాల్లో సేవలు వినియోగించుకోవాలనుకునే వారు వెళ్లకపోవడం ఉత్తమం.






