కామారెడ్డిలో విషాదం.. భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

by Bhanu |   (  Updated:2025-05-01 09:38:27  IST  )

జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న పూజిత అనే వివాహిత (20) రెండంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.

కామారెడ్డిలో విషాదం.. భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
X

దిశ, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న పూజిత అనే వివాహిత (20) రెండంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. గత ఏడు నెలల క్రితం సాయికుమార్ అనే వ్యక్తితో పూజితకు వివాహం జరిగిందని తెలిపారు. కాగా పూజిత ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమంటూ పూజిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెళ్లయిన నాటి నుంచి తరచూ భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతుండేవని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి, పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




Next Story