- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుదాఘాతానికి యువ రైతు మృతి
by Bhanu |
విద్యుదాఘాతానికి ఓ యువ రైతు బలైన ఘటన రామారెడ్డి మండలం ఘన్ పూర్ తండా లో బుధవారం చోటు చేసుకుంది.

X
దిశ, రామారెడ్డి: విద్యుదాఘాతానికి ఓ యువ రైతు బలైన ఘటన రామారెడ్డి మండలం ఘన్ పూర్ తండా లో బుధవారం చోటు చేసుకుంది. భుక్యా రాజు (35) అనే రైతు కు గాలివాన కు ఊడి పడిన విద్యుత్ వైరు యమ పాశమైంది. ఎప్పటి మాదిరిగానే రాజు తన వ్యవసాయ క్షేత్రంలో కి వెళుతుండగా మంగళవారం కురిసిన గాలి వాన కు తెగి కింద పడ్డ విద్యుత్ (కండక్టర్) వైరు ను తొక్కడం తో అక్కడికక్కడే మృతిచెందాడు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన రాజు మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి రాక పోయేసరికి ఆందోళన కు గురైన కుటుంబ సభ్యులు వ్యవసాయ క్షేత్రం వద్దకు వచ్చారు. విద్యుత్ వైరు పై విగత జీవి గా పడి ఉన్న రాజు ను చూసి దుఃఖ సాగరంలో మునిగారు. మృతుని కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
Next Story






