అధికారుల కళ్లు గప్పుతున్న ఎల్లో డ్రాప్స్..!

by Nallavelli.Anjaneyulu |

ఎర్రపహడ్ గ్రామంలో కురుస్తున్న పసుపు చినుకుల మిస్టరీ ఇప్పుడు అధికారులకు సైతం సవాల్‌ విసురుతోంది. దిశ పత్రికలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో ఎట్టకేలకు నిద్రమత్తు వదిలిన మండల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు.

అధికారుల కళ్లు గప్పుతున్న ఎల్లో డ్రాప్స్..!
X

దిశ,​ తాడ్వాయి : ఎర్రపహడ్ గ్రామంలో కురుస్తున్న పసుపు చినుకుల మిస్టరీ ఇప్పుడు అధికారులకు సైతం సవాల్‌ విసురుతోంది. దిశ పత్రికలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో ఎట్టకేలకు నిద్రమత్తు వదిలిన మండల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. ఆ సమయంలో జరిగిన పరిణామాలు సినిమా స్క్రిప్టును తలపిస్తున్నాయి. అధికారులు గ్రామంలో ఉదయం 11:00 గంటల నుంచి 11:30 గంటల ఉన్నంత సేపు ఆగిపోయిన ఆ వింత చుక్కలు, వాళ్లు కారు ఎక్కి వెళ్లిన మరుక్షణమే మళ్లీ ప్రత్యక్షం కావడం ఇప్పుడు గ్రామంలో పెను సంచలనంగా మారింది.

అరగంట నిరీక్షణ.. అధికారులు వెళ్లగానే ప్రత్యక్షం!

మండల అధికారులు బాధిత కాలనీని మంగళవారం సందర్శించారు.ఎల్లో డ్రాప్స్ ఎక్కడ పడుతున్నాయో తెలుసుకోవడానికి వారు ప్రయోగాత్మకంగా తెల్ల కాగితాలను బహిరంగ ప్రదేశాల్లో ఉంచారు.దాదాపు అరగంట పాటు అధికారులు అక్కడ నిరీక్షించినా ఒక్క చుక్క కూడా పడలేదు.దీంతో అధికారులు వెనుదిరిగారు.కానీ,వారు వెళ్లిన కొద్దిసేపటికే అధికారులు పెట్టిన అదే తెల్ల కాగితాలపై చిక్కటి పసుపు రంగు చుక్కలు ప్రత్యక్షమయ్యాయి.ఇది చూసిన కాలనీవాసులు ఆశ్చర్యంతో పాటు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.

​బ్యాంకు మేనేజర్ కారుపై కూడా..

ఈ మిస్టరీ కేవలం నివాసాలకే పరిమితం కావడం లేదు. స్థానిక ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ తన కారును బ్యాంకు ముందు పార్క్ చేయగా, దానిపై కూడా ఈ పసుపు చుక్కలు భారీగా పడ్డాయి.మొదట ఒక కాలనీకే పరిమితమైన ఈ ఎల్లో అటాక్ గుడికి ప్రక్కనే ఉన్న బ్యాంక్ ముందర పార్క్ చేసిన ఆ మేనేజర్ కార్ పై కూడా ఈ ఎల్లో డ్రాప్స్ కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ల్యాబ్ రిపోర్టులే ముద్దు.. కంటితుడుపు చర్యలొద్దు

​అధికారులు వచ్చి అరగంట సేపు ఉండి వెళ్లడం వల్ల ఉపయోగం లేదని,పూర్తిస్థాయిలో శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు ఈ ఎల్లో డ్రాప్స్ పై అనుమానాలను నివృత్తి చేయాలని,కోరుతున్నారు.ఇక నైనా అధికారులు కంటితుడుపు చర్యలతో కాకుండా ఈ ఎల్లో డ్రాప్స్ శాంపిల్స్ సేకరించి తక్షణమే ఈ చుక్కలను ల్యాబ్‌కు పంపి,ఇవి రసాయనాలా? లేదా ఏదైనా కీటకాల వల్ల జరుగుతున్నదా?...గాలిలో ఏవైనా మార్పులు ఉన్నాయా? లేదా స్థానిక పరిశ్రమల ప్రభావమా? అన్నది శాస్త్రీయంగా తేల్చాలి గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story