- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎర్రపహడ్‌పై పసుపు చుక్కల పంజా
అది ఒక అదృశ్య శత్రువులా గ్రామాన్ని చుట్టుముడుతోంది. ఆకాశం నుంచి పడుతున్న ఆ పసుపు రంగు చుక్కలు ఎర్రపహడ్ వాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

దిశ, తాడ్వాయి : అది ఒక అదృశ్య శత్రువులా గ్రామాన్ని చుట్టుముడుతోంది. ఆకాశం నుంచి పడుతున్న ఆ పసుపు రంగు చుక్కలు ఎర్రపహడ్ వాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొదట ఏదో అనుకొని సంఘటన అని సరిపెట్టుకున్నా, రోజు రోజుకూ బాధితుల సంఖ్య పెరగడం, సుమారు 15 నివాసాల వరకు ఈ ఎల్లో డ్రాప్స్ విస్తరించడం ఇప్పుడు గ్రామంలో పెను సంచలనంగా మారింది. అసలు ఈ రంగు ఎక్కడి నుంచి వస్తోంది? ఇది ప్రకృతి వైపరీత్యమా లేక పరిశ్రమల విషమా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది.
అంతుచిక్కని ఆనవాళ్లు.. పెరుగుతున్న ఆందోళన
గ్రామంలోని ఒకే కాలనీలో గతకొన్ని రోజుల తరబడి ఎలా పడుతాయి,ముఖ్యంగా 15 ఇళ్ల పరిసరాల్లో ఈ వింత దృశ్యాలు కనిపిస్తున్నాయి. డాబాల పైన, గుడి పరిసరాల్లో,ఇంటి ముందు ఆరవేసిన బట్టల మీద, పచ్చని చెట్ల ఆకుల మీద పసుపు రంగులో చిక్కటి ద్రవం చుక్కలు చుక్కలుగా పడి ఉండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. బయటకు చెబితే ఎవరైనా నవ్వుతారేమో,మా ఇంటికేదో కీడు జరిగిందని అంటారేమో అని ఇన్నాళ్లూ దాచినా.. దిశ పత్రికలో వచ్చిన కథనంతో బాధితులంతా ఒక్కొక్కరుగా గొంతు విప్పుతున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బాధితులు..
ఈ మిస్టరీ చుక్కల భయం గ్రామస్థులను ఆసుపత్రి బాట పట్టించింది. సోమవారం నాడు బాధిత కుటుంబ సభ్యులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) వెళ్లి అక్కడి డాక్టరును కలిశారు. తమ ఇళ్లపై పడుతున్న ఆ పసుపు రంగు ద్రవం తాలూకు వివరాలను వివరించి, తమ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆ 'ఎల్లో డ్రాప్స్' నమూనాలను సేకరించి, ల్యాబ్‌కు పంపించి అవి ఏమిటో శాస్త్రీయంగా నిర్ధారించాలని వారు వైద్యులను కోరారు.
ఆరోగ్యంపై ఆందోళన.. అధికారుల మౌనం
ఈ పసుపు చినుకుల వల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని గ్రామస్థులు ఆందోళన చెండుతున్నారు.ఈ చుక్కలు శరీరానికి తగిలితే ఇన్ఫెక్షన్లు ఏమైనా వస్తాయా?సమీపంలో ఉన్న పరిశ్రమల నుండి వెలువడే రసాయన వ్యర్థాలు గాలిలో కలిసి ఇలా పడుతున్నాయా?బావుల్లోని నీరు,పంటలపై,బయట ఉన్న పశువుల మేతపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది? ఉన్నతాధికారులు మాత్రం కనీసం గ్రామం వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
నమూనాలను సేకరించి.. ల్యాబ్ పరీక్షలే శరణ్యం
స్థానిక ప్రజల డిమాండ్ ఒక్కటే.. వెంటనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్,ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగాలి.ఆ పసుపు రంగు నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపాలి.అది కేవలం పుప్పొడి రేణువులా లేక ప్రమాదకర రసాయనాలా అనేది తేల్చాల్సిన బాధ్యత సంబందించిన అధికారులపై ఉంది.అప్పటివరకు ఈ పసుపు మిస్టరీ గ్రామస్థులకు కంటిమీద కునుకు లేకుండానే చేస్తోంది.






