- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Yellareddy: మెడికల్ ఆఫీసర్ పేరుతో వసూళ్లు.. వెలుగులోకి కాంట్రాక్టు ఉద్యోగి బాగోతం
చేసేది కాంట్రాక్ట్ ఉద్యోగమైనా.. తాను మెడికల్ ఆఫీసర్‌నని.. డీఎంహెచ్‌వో పేరిట ఆర్‌ఎంపీ,పీఎంపీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఉదంతం వెలుగుచూసింది.

దిశా ఎల్లారెడ్డి : చేసేది కాంట్రాక్ట్ ఉద్యోగమైనా.. తాను మెడికల్ ఆఫీసర్‌నని.. డీఎంహెచ్‌వో పేరిట ఆర్‌ఎంపీ,పీఎంపీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఉదంతం కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. దేవునిపల్లి పల్లె దవాఖానాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న బాలకృష్ణ తాను దేవునిపల్లి మెడికల్ ఆఫీసర్‌నని చెప్పుకుంటూ, ఆర్‌ఎంపీ, పీఎంపీల వద్ద వసూళ్లు చేసేవాడు. ఈ క్రమంలో శుక్రవారం లింగంపేట మండలకేంద్రంలో ఓ ఆర్‌ఎంపీ వద్దకు వచ్చి డీఎంహెచ్‌వో పేరిట రూ.15వేలు వసూలు చేశాడు. అక్కడి నుంచి మరో ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లి రూ.20వేలు డిమాండ్ చేయగా, అతను బతిమాలి రూ.10వేలు ఇచ్చాడు. అయితే, కొద్దిసేపటికి అనుమానం వచ్చి నిలదీయడంతో పొంతనలేని సమాధానమిచ్చాడు. దీంతో అతనికి దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ విషయమై మండల మెడికల్ ఆఫీసర్ హిమబిందును వివరణ కోరగా.. కాంటాక్ట్ ఉద్యోగి బాలకృష్ణ మెడికల్ ఆఫీసర్‌నని చెప్పి డీఎంహెచ్‌వో పేరిట వసూళ్లకు పాల్పడుతున్నట్లు దృష్టికి వచ్చిందని, డీఎంహెచ్‌వో కు సైతం ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
చర్యలు తీసుకుంటాం.. డీఎంహెచ్‌వో
బాలకృష్ణ ఆర్‌ఎంపీల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న విషయం దృష్టికి వచ్చింది. ఇప్పటివరకు ముగ్గురి వద్ద డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ తెలిపారు.






