- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోరందుకున్న ధాన్యం కొనుగోళ్లు
మునుపెన్నడూ లేని విధంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు జిల్లాలో జోరందుకున్నాయి.

దిశ, భిక్కనూరు : మునుపెన్నడూ లేని విధంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు జిల్లాలో జోరందుకున్నాయి. వివిధ రకాల తెగుళ్ల బారిన పడి, ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందో లేదో నన్న టెన్షన్ తో ఉన్న రైతులకు, కొంత తక్కువ స్థాయిలోనైనా దిగుబడి రావడం, కోత కోయడం ఆలస్యం చేస్తే ఇబ్బందులు తప్పవన్న భయం ధాన్యం రైతులను పట్టిపీడించింది. కాని ధాన్యం దిగుబడి ఆశించిలో ఆశించిన స్థాయిలో కంటే ఎక్కువ మొత్తంలో దిగుబడి రావడం రైతులను కొంతమేర ఊరడించినట్లు చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ధాన్యం రాశులతో ఖాళీ స్థలాలు, ప్రధాన రహదారులు నిండిపోయాయి. కొనుగోళ్లు ప్రారంభించిన వారం పది రోజుల్లో ల క్షా 25 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈసారి కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించడంతో, ధాన్యం రోడ్లపైకి రావడమే ఆలస్యం, తేమ శాతాన్ని గుర్తించి, వెంటనే హమాలీలతో, లారీలో లోడ్ చేయించి పంపించేస్తున్నారు. సుమారు 600 లారీలతో ఒక్కో వాహనంలో 25 టన్నుల నుంచి మొదలుకొని 30 టన్నుల ధాన్యం బస్తాలను లారీలలో లోడ్ చేసి పంపిస్తున్నారు.
కొనుగోళ్ల ప్రక్రియ ఇదివరకటికంటే వేగంగా జరుగుతున్నప్పటికీ, కాంటా అయిన ధాన్యం రైతులకు మాత్రం పేమెంట్ డిలే అవుతుండడం పేమెంట్ కోసం ధాన్యం రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్యాబ్ ఎంట్రీ అయి, ఓటిపి వచ్చిన రైతులకు మూడు నాలుగు రోజులలో వారి అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. అయితే ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సుమారు మూడు కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే ధాన్యం కాంటా అయిన వారం రోజుల్లో రైతులకుపేమెంట్ జరగాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, సొసైటీల ద్వారా కొనుగోలు చేస్తున్న వారికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యతను 50శాతం ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పగించింది.
అకాల వర్షాల కారణంగా అధికారుల సూచనలు రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తుండడం మున్ముందు మరిన్ని వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ తో పాటుగా జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ, అక్కడి సిబ్బందికి సలహాలు సూచనలు చేస్తున్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేసి, ధాన్యాన్ని సైతం ఆలస్యం చేయకుండా రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ధాన్యం తడవకుండా ఉండేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద మార్కెట్ కమిటీలు, సొసైటీల ఆధ్వర్యంలో టార్పాలిన్ లను అందుబాటులో ఉంచారు.






