కుస్తీ పోటీలు యువతలో స్ఫూర్తినిస్తాయి

by Ratna Kumari |

యువతలో స్ఫూర్తిని కలిగిస్తూ ప్రాచీన సాంప్రదాయాలకు జీవం పోసేటివే కుస్తీ పోటీలు అని సుల్తాన్ నగర్ సర్పంచ్ వడ్ల బ్రహ్మం అన్నారు.

కుస్తీ పోటీలు యువతలో స్ఫూర్తినిస్తాయి
X

దిశ, నిజాంసాగర్ : యువతలో స్ఫూర్తిని కలిగిస్తూ ప్రాచీన సాంప్రదాయాలకు జీవం పోసేటివే కుస్తీ పోటీలు అని సుల్తాన్ నగర్ సర్పంచ్ వడ్ల బ్రహ్మం అన్నారు. బుధవారం నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామ శివారులో బారడి పోచమ్మ తల్లి పండగ సందర్భంగా ఆలయం వద్ద నిర్వహిస్తున్న జాతరలో బాగంగా కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు. ప్రాచీన సంప్రదాయాలను సజీవంగా నిలుపుతూ.. యువతలో స్పూర్తిని రగిలించేలా ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు ఏర్పాటు చేయగా.. ఈ కుస్తీ పోటీలను తిలకించేందుకు వివిధ గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కుస్తీ పోటీలలో తలపడేందుకు చుట్టు పక్కల మండలాలతో పాటు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి మల్ల యోధులు తరలివచ్చారు. చిన్నారుల నుంచి మొదలైన కుస్తీ పోటీలలో మల్ల యోధులు ఆసక్తి చూపించారు. పది రూపాయలతో ప్రారంభమైన కుస్తీ పోటీలు రూ.500 వరకు నిర్వహించారు. చిట్ట చివరి కుస్తీ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి రూ.3000 నగదు బహుమతితో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వడ్ల బ్రహ్మం, గ్రామ పెద్దలు మహిపాల్ రెడ్డి, కూర్మ సాయిలు, సయ్యద్ షర్ఫుద్దీన్, ఎర్ల బ్యాతయ్య, వెంకటస్వామి, సయ్యద్ హుసేని, ఈశ్వర్, ఎర్ల శ్రీనివాస్, చాంద్ పాషా, సత్యనారాయణ స్వామి, షేక్ హైమద్, అంజా గౌడ్ పాల్గొన్నారు.

Next Story