ప్రాచీన సాంప్రదాయాలకు జీవం పోసేవి కుస్తీ పోటీలు

by Ratna Kumari |

ప్రాచీన సాంప్రదాయాలకు జీవం పోసి, యువతలో స్ఫూర్తిని రగిలించేలా చేసేటివి కుస్తీ పోటీలని నర్వ గ్రామ సర్పంచ్ గొట్టం అనుసూజ నర్సింలు అన్నారు.

ప్రాచీన సాంప్రదాయాలకు జీవం పోసేవి  కుస్తీ పోటీలు
X

దిశ, నిజాంసాగర్ : ప్రాచీన సాంప్రదాయాలకు జీవం పోసి, యువతలో స్ఫూర్తిని రగిలించేలా చేసేటివి కుస్తీ పోటీలని నర్వ గ్రామ సర్పంచ్ గొట్టం అనుసూజ నర్సింలు అన్నారు. ఆదివారం మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామం మత్తడి పోచమ్మ జాతరలో బాగంగా ప్రాచీన సంప్రదాయాలను సజీవంగా నిలుపుతూ, యువతలో స్పూర్తిని రగిలించేలా ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. కుస్తీ పోటీలలో తలపడేందుకు చుట్టుపక్కల మండలాలతోపాటు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి మల్ల యోధులు తరలివచ్చారు.

చిన్నారుల నుండి మొదలైన కుస్తీ పోటీలలో మల్ల యోధులు ఆసక్తి చూపించారు. పది రూపాయలతో ప్రారంభమైన కుస్తీ పోటీలు 500 రూపాయల వరకు నిర్వహించారు. చిట్ట చివరి కుస్తీ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నర్వ గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పిడి రాములు గుప్తా జ్ఞాపకార్థం ఆయన కుమారుడు రాంప్రసాద్ ఐదు తులాల వెండి కడెం బహుకరించడం జరిగింది. దీంతోపాటు గ్రామస్తులు 2000/-రూపాయలు నగదు బహుమతితో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొట్టం అనుసుజ నరసింహులు, ఉప సర్పంచ్ చింతల దుర్గా నరేష్, గ్రామ పెద్దలు సతీష్ దొర, గొల్ల గోపాల్, చింతల దుర్గ ప్రసాద్, సిరిగిరి గంగారం, చాకలి డాకయ్య, గొల్ల పవన్, గొల్ల బాల్ రాజు, కయితి శీను, కరోబార్ ప్రభాకర్ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story