- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీసుకున్న అప్పు ఎగ్గొట్టేందుకే మహిళ హత్య
అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకూడదనే ఉద్దేశంతో మహిళను హత్య చేసిన దారుణ ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.

దిశ, కామారెడ్డి: అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకూడదనే ఉద్దేశంతో మహిళను హత్య చేసిన దారుణ ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. ఈ కేసును 48 గంటల్లో ఛేదించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం మీడియాకు వెల్లడించారు. గత నెల 30న నర్సన్నపల్లి గ్రామానికి చెందిన చిదుర కవిత (44) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో వ్యవసాయ భూమిలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి, దోమకొండ మండలం చింతమాన్‌పల్లి గ్రామానికి చెందిన పాత నేరస్తుడు జంగంపల్లి మహేష్‌ను అరెస్టు చేశారు.
మహేష్ గతంలో మర్డర్ కేసులో నిందితుడిగా ఉండగా, ఆ కేసులో బెయిల్ కోసం కవిత వద్ద రూ.1 లక్ష అప్పుగా తీసుకున్నాడు. కవిత అప్పు తిరిగి అడుగుతుండడంతో, ఆమెను చంపేస్తే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఆలోచనతో హత్యకు పూనుకున్నాడు. గత నెల 30న డబ్బులు చెల్లిస్తానని నమ్మించి ఆమెను వ్యవసాయ భూమికి పిలిపించి, అక్కడే ముఖంపై బలంగా కొట్టి, పడిపోవడంతో చీర కొంగుతో ఉరేసి హత్య చేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు (కమ్మలు, మాటీలు, వంకు ఉంగరం) మరియు మొబైల్ ఫోన్ దొంగిలించి పారిపోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, ఆభరణాలు, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును వేగంగా ఛేదించిన కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రాజు, క్రైమ్ టీమ్ సభ్యులను ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.






