- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
భర్త అక్రమ సంబంధం.. మహిళా సంఘాలతో కొట్టించిన భార్య..!
దిశ, ఆర్మూర్ : భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. రెడ్ హ్యాండెడ్ గా భార్యలు పట్టుకుంటున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇంతకు మించిన ఘటన ఇప్పుడు నందిపేట్ లో జరిగింది. భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఏకంగా మహిళా సంఘాలతోనే ఆ భార్య కొట్టించింది. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామానికి చెందిన వ్యక్తి ఆలూర్ మండలంలోని దేగాం గ్రామ నర్సరీలో పనిచేసే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అతని భార్య పదే పదే అనుమానించింది. భర్త మాట వినట్లేదని మహిళా సంఘాలను ఆశ్రయించింది. గత మూడు రోజుల క్రితం ఆలూర్ మండలంలోని దేగాం గ్రామ నర్సరీలో పనిచేసే మహిళను.. ఆ నర్సరీలో పనిచేస్తున్న తన భర్తను మహిళా సంఘాల సభ్యులతో కలిసి జుట్టు పట్టి దారుణంగా కొట్టింది భార్య. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం భార్య తన భర్తకు భర్తకు ఫోన్ చేసి దేగాం నర్సరీకి రావాలని చెప్పడంతో భర్త దేగాం లోని నర్సరీ కి వచ్చాడు. దీంతో అక్కడ ఉన్న అతని భార్య.. మహిళ సంఘాల సభ్యులు నర్సరీలో పని చేసే ఆ మగ వ్యక్తిపై చెప్పులు... కర్రలతో.. దాడి చేశారు. కాగా ఆ బాధితుడు ఓ ప్రజా ప్రతినిధి సహకారంతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తనకు ఆ మహిళతో ఎలాంటి అక్రమ సంబంధం లేదని వాపోతున్నాడు. మహిళా సంఘాలు చట్టాన్ని వారి చేతుల్లోకి ఎలా తీసుకుంటారని బాధితుడు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులో ఆర్మూర్ పోలీసులకు వివరించినట్లు తెలిసింది. ఈ కేసు పై విచారణ చేసేందుకు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ రవికుమార్ దేగాం గ్రామానికి వెళ్లినట్లు విచారణ చేస్తున్నారు.