- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మమ్మల్నే ఆపుతావా.. పోలీసులపై దాడి.. చివరికి ఏమైందంటే..?
నెంబర్ ప్లేట్ లేని బైక్ ను పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు.

దిశ ,భిక్కనూరు : నెంబర్ ప్లేట్ లేని బైక్ ను పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. దీంతో ఆపకపోవడమే కాకుండా, అడ్డుకోబోయిన కానిస్టేబుల్ పై దాడి చేసిన ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం రాత్రి భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు వెహికిల్ చెకింగ్ చేస్తున్నారు. కామారెడ్డి వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న హోండా షైన్ బైక్ కు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో.. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్, బైకు ను పక్కకు తీసుకెళ్లి ఆపాలని సూచించాడు. సదుర వాహనదారుడు తాగిన మైకంలో ఉన్నాడో ఏమో తెలియదు కానీ.. నా బైక్ నే ఆపుతావా అంటూ కానిస్టేబుల్ కు టక్కరిచ్చి, బైక్ తో ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాడు.
దీంతో టోల్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కొందరు ఈ విషయాన్ని గమనించి, ద్విచక్ర వాహనదారున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసేందుకు నోట్లో పైపు వేసే ప్రయత్నం పోలీసులు చేయగా.. హెల్మెట్ తీసి మరో కానిస్టేబుల్ ను కొట్టాడు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సదర్ పోలీసులు దాడి చేసిన వ్యక్తిని, అతని ద్విచక్ర వాహనాన్ని స్టేషన్ కు తీసుకొని వచ్చి, బాధితులు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేసినట్లు సమాచారం.






