- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదనపు కట్నం ఇస్తావా.. లేదా..
అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామన్నపేట మండలంలోని నిదాన్ పల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

దిశ, రామన్నపేట : అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామన్నపేట మండలంలోని నిదాన్ పల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల పట్టణానికి చెందిన బొబ్బిలి మల్లయ్య కూతురు కావ్యను రామన్నపేట మండలంలోని నిధాన్ పల్లి గ్రామానికి చెందిన జినుకుల ఆంజనేయులుకు ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారం రోజుల క్రితం నుంచి మృతురాలు కావ్యను తన భర్త ఆంజనేయులు అదనపు కట్నం కోసం వేధించారన్నారు.
మృతురాలిని తన భర్త కొట్టి ఇంటి నుంచి వెళ్లిపోయి.. ఈ రోజు వరకు రాలేదని తెలిపారు. మృతురాలు మానసిక వేదనకు గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఫిర్యాదు మేరకు ఎస్సై పి.మల్లయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆంజనేయులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.






