- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ ను వీడను.. బీజేపీలో చేరను..!
తాను బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి మారుతున్నానని కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరుగుతుందని అది నిరాధారమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి బుధవారం తీవ్రంగా ఖండించారు.

దిశ, ఆర్మూర్ : తాను బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి మారుతున్నానని కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరుగుతుందని అది నిరాధారమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి బుధవారం తీవ్రంగా ఖండించారు. తాను జీవితంలో ఎప్పుడూ బీఆర్ఎస్ ను వీడను, బీజేపీతో సహా మరే పార్టీలో చేరను అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేదని.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు పథకం ప్రకారం.. సాగిస్తున్న కుట్రలో భాగమే తనపై ఈ దుష్ప్రచారం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకూ కేసీఆర్ బాట వీడనని, చివరి వరకు గులాబీ నీడలోనే రాజకీయాలు చేస్తానని ఆయన అన్నారు. తాను రాజకీయ ఓనమాలు దిద్దుకున్న పార్టీ బీఆర్ఎస్ అని, తన రాజకీయ గురువు, ఆరాధ్య దైవం కేసీఆర్ అని జీవన్ రెడ్డి తెలిపారు. తాను బీజేపీలో చేరడానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీని ఢిల్లీలో కలిసినట్టు కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిజానికి తాను ఏ కేంద్ర మంత్రిని కలవలేదని, తాను హైదరాబాద్ లోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి పేక్ ప్రచారాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని జీవన్ రెడ్డి హెచ్చరించారు.






