- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య..!
దిశ, కామారెడ్డి : ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా ఋ హత్యకు సంబంధించిన వివరాలను విలేకర్ల సమావేశంలో

దిశ, కామారెడ్డి : ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా ఋ హత్యకు సంబంధించిన వివరాలను విలేకర్ల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. ఈనెల 16న గాంధారి శివారులోని చద్మల్ రోడ్డులో గుర్తు తెలియని మృతదేహం ఉందని పంచాయతీ కార్యదర్శి నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే నేరెల్ కి చెందిన ఓ యువకుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. మేడ్చల్ మల్కాజ్ గిరికి చెందిన నరేష్, నవనీత దంపతులు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇలా పని చేసుకునే క్రమంలోనే ఆంజనేయులు అనే వ్యక్తితో నవనీతకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది.
ఈ క్రమంలోనే ఓ రోజు బడాపహాడ్ దర్గా వద్దకు వెళ్దామని ముగ్గురు కలిసి రెండు బైకులపై వెళ్లారు. అక్కడ ఇద్దరూ క్లోజ్ గా ఉండటం గమనించిన నరేష్.. భార్య నవనీతను వేధించడం ప్రారంభించాడు. దీంతో నరేష్ అడ్డుతొలగించుకునేందుకు మరోసారి బడాపహాడ్ వెళ్దామని బయలుదేరారు. తిరిగి గాంధారికి చేరుకోగానే వైన్ షాపులో మద్యం తీసుకొని చద్మల్ రోడ్డులో నరేష్ కు ఫుల్ గా తాపించారు. మద్యం మత్తులో ఉన్న నరేష్ ను కిందికి తోసేసి ఛాతిపై దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ తీసుకొచ్చి కాల్చి కాలువలో పడేసి వెళ్లిపోయారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు హైదరాబాద్ లో వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి బైక్, మొబైల్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్టు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో కీలక సమాచారం అందించిన నేరెల్ యువకుడితో పాటు కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.






