- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిషేధిత చైనా మాంజా విక్రయాలపై విస్తృత తనిఖీలు
by Ratna Kumari |
నిషేధిత చైనా మాంజా కారణంగా ఎవరికైనా ప్రాణహాని కలిగితే బాధ్యులపై హత్యానేరం క్రింద కేసు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య హెచ్చరించారు.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిషేధిత చైనా మాంజా కారణంగా ఎవరికైనా ప్రాణహాని కలిగితే బాధ్యులపై హత్యానేరం క్రింద కేసు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిషేధిత చైనా మాంజా విక్రయాలు జరగకుండా పోలీస్ శాఖ ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహిస్తోందన్నారు. శనివారం పోలీసుల తనిఖీల్లో భాగంగా నిజామాబాద్, అర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని మండల కేంద్రాలు, పలు మేజర్ గ్రామాలతో పాటు, మారు మూల గ్రామాల్లోని గాలిపటాలమ్మే దుకాణాలు, స్టేషనరీ షాపులు, తాత్‌కాలిక గాలిపటాల విక్రయ కేంద్రాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
Next Story






