- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్ల పునరుద్ధరణ ఎప్పుడో..?
దిశ, మాచారెడ్డి : కామారెడ్డి జిల్లాల్లో ఆగస్టు నెలలో క్లౌడ్ బ్రస్ట్ వల్ల కోతకు గురై, కొట్టుకుపోయి, ధ్వంసమైన రోడ్లు,

దిశ, మాచారెడ్డి : కామారెడ్డి జిల్లాల్లో ఆగస్టు నెలలో క్లౌడ్ బ్రస్ట్ వల్ల కోతకు గురై, కొట్టుకుపోయి, ధ్వంసమైన రోడ్లు, వంతెనలు, కల్వర్టుల పునరుద్ధరణ పై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. స్థానిక అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి పునరుద్ధరణ పనులను పక్కన పడేశారు. ఆ రోడ్లు, వంతెనలపై ప్రయాణం భయం భయంగా సాగుతుంది. జిల్లాలో క్లౌడ్ బ్రస్ట్ వల్ల దెబ్బతిన్న రోడ్లు వంతెనలు కల్వర్టుల సంఖ్య784. వీటి మరమ్మతులకు రూ. 558.90 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. తాత్కాలిక మరమ్మతులకు తప్ప పునరుద్ధరణ కోసం ప్రభుత్వం పైసా కూడా రిలీజ్ చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేసి అధికారులతో వరద నష్టం అంచనాలు తయారు చేయించుకున్నారు. రోడ్లు వంతెనలు, కల్వర్టుల పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యతనిస్తానని ప్రకటించారు. అయినప్పటికీ ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయిందని ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్లు, వంతెనల మరమ్మతులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. కానీ సీఎం హామీలు ఇప్పటి వరకు నెరవేరకపోవడం శోచనీయమన్నారు.
గజానికి పైగా కోతకు గురైన రోడ్లు
వరద తాకిడికి రోడ్లు గజానికి పైగా కోతకు గురై లోయలను తలపిస్తున్నాయి. ఆ రోడ్ల పై ప్రయాణం భయానకంగా ఉందని వాపోతున్నారు. వంతెనల అప్రోచ్ లు, కల్వర్టుల పైపులు తెగిపోయి నిలబడ్డాయి. వాటిని చూసి ప్రయాణీకులు భయకంపితులవు తున్నారు.
అప్రోచ్ లను మరిచారు
వంతెనల ను రోడ్డు కు లింక్ చేసే అప్రోచ్ లు కొట్టుకుపోయాయి. వాటిని కూడా తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెట్టారు. అప్రోచ్ లింక్ దాటే వరకు ప్రయాణం భయమే. వంతెనల అప్రోచ్ లనైనా మరమ్మతులు చేయకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు.
ఆర్బాటాలకు ఎక్కడివి
అభివృద్ధి పనుల కు నిధులు లేవని చెప్పే ప్రభుత్వ ఆర్భాటాలకు ఎక్కడీ నుండి వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ, గ్లోబల్ సమ్మిట్, విశ్వ సుందరి పోటీలు వంటి నిర్వహణ కోసం వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తున్నాయని చమత్కరి స్తున్నారు.






