- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మండల పరిషత్ కాంప్లెక్స్ కు గ్రహణం వీడేది ఎప్పుడు..?
దిశ, కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కాంప్లెక్స్ కు గ్రహణం వీడేది ఎన్నడని పలువురు వాపోతున్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ భవనాలు వాటి ఆలనా పాలన కరువు అవ్వడంతో నిరుపయోగంగా ఉండడం వల్ల అ

దిశ, కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కాంప్లెక్స్ కు గ్రహణం వీడేది ఎన్నడని పలువురు వాపోతున్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ భవనాలు వాటి ఆలనా పాలన కరువు అవ్వడంతో నిరుపయోగంగా ఉండడం వల్ల అవి శిథిలావస్థకు చేరుతున్నాయి. ప్రజల అవసరాల కోసం నిర్మించిన భవనాలు వృథాగా ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ కాంప్లెక్స్ అధికారులకు, సిబ్బంది వాహనాల పార్కింగ్ పరిమితమైంది. ఆర్భాటంగా నిర్మించిన భవనాలు నేటికీ వినియోగంలోకి రాలేదు. రూ.లక్షలు పోసి నిర్మించినవి ఖాళీగా దర్శనమిస్తూ.. పాలకుల, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. వినియోగంలోకి తీసుకురాకుండా భవనాలు నిర్మిస్తే మాత్రం ఏం లాభమని ప్రజలు పెదవి విరుస్తున్నారు. పూర్తయిన భవనాలు అసాంఘిక కార్యక్రమాలు, మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. ఎస్ ఎఫ్ సి 2021- 22 నిధులతో 15 లక్షలాది రూపాయల వ్యయంతో ఫిబ్రవరి 22, 2023 నా అప్పటి రోడ్డు భవనాల, గృహ నిర్మాణ, శాసనసభ్య వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. అప్పుడు నిర్మించిన కాంప్లెక్స్ 4 షెటర్లు నిరుపయోగంగా ఉన్నాయి. లక్షలు పోసి నిర్మించిన భవనం ప్రస్తుతం తాళం వేసి దర్శనమిస్తోంది. నిరుపయోగంగా ఉండటం వల్ల నెలకు వేల రూపాయల ఆదాయం మండల పరిషత్ కోల్పోతున్నది. ఇప్పటికైనా షెటర్లు వినియోగంలోకి తేవాలని పలువురు కోరుతున్నారు.






