పండ‌గ వేళ అల్ల‌ర్ల‌కు పాల్ప‌డితే ఊపేక్షించం

by Naveena |

హోలీ పండగను జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిజామాబాద్ సీపీ పోతరాజు సాయి చైతన్య ప్రజలకు సూచించారు.

పండ‌గ వేళ అల్ల‌ర్ల‌కు పాల్ప‌డితే ఊపేక్షించం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ మార్చి 13: హోలీ పండగను జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిజామాబాద్ సీపీ పోతరాజు సాయి చైతన్య ప్రజలకు సూచించారు. హోలీ సంద‌ర్భంగా ఆరోగ్య‌క‌ర‌మైన‌ సంప్ర‌దాయ రంగుల‌ను మాత్రమే వినియోగించాల‌ని సీపీ అన్నారు. శుక్ర‌వారం ఉద‌యం 6 గంట‌ల నుంచి మద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మాత్రమే వేడుక జ‌రుపుకోవాల‌ని ఆయన తెలిపారు. రంగులు ఆడటం ఇష్ట‌ప‌డని వ్య‌క్తులపై రంగులు చల్లడం, ప్ర‌దేశాలు, వాహ‌నాల‌పై రంగులు చ‌ల్ల‌టం, రంగు నీళ్ల‌ను పోయ‌డం స‌రికాద‌ని సీపీ అన్నారు.

బ‌హిరంగ ప్రాంతాల్లో ఇత‌రుల‌ను ఇబ్బందులు పెట్ట‌డం, అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించ‌డం వంటి అల్ల‌ర్ల‌కు పాల్ప‌డితే చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిస్తే ఏమాత్రం ఉపేక్షించ‌బోమ‌ని హెచ్చ‌రించారు. బైకు‌లతో ర్యాలీలు చేయ‌డం, ర‌హ‌దారుల‌పై ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిర‌గ‌డం చేయ‌వ‌ద్ద‌ని ఆయన హిత‌వు ప‌లికారు. హోలీ పండ‌గ నాడు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వ‌హిస్తామ‌న్నారు. మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డిపి రోడ్డు ప్ర‌మాదాల‌కు కార‌ణం కావొద్ద‌న్నారు. ముఖ్యంగా మ‌హిళ‌ల ప‌ట్ల గౌర‌వంగా న‌డుచుకోవాల‌న్నారు. క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో సీసీ టీవీ కెమెరాల నిఘా ఉంటుంద‌ని సీపీ సాయి చైతన్య గుర్తు చేశారు. పోలీసుల హెచ్చరికలను ఆషామాషీగా తీసుకుని ఇబ్బందుల్లో పడొద్దన్నారు.

Next Story