- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణాలైనా అర్పిస్తాం.. ఇక్కడ మాత్రం ఫార్మా కంపెనీలు వద్దు
జల, వాయు కాలుష్యంతో బాధపడుతున్న తమకు, కొత్తగా ఫార్మా కంపెనీలా ఒక వద్దే వద్దంటూ ముక్తకంఠంతో వ్యతిరేకించిన వైనం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది.

దిశ, భిక్కనూరు : జల, వాయు కాలుష్యంతో బాధపడుతున్న తమకు, కొత్తగా ఫార్మా కంపెనీలా ఒక వద్దే వద్దంటూ ముక్తకంఠంతో వ్యతిరేకించిన వైనం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఫ్యూజన్ హెల్త్ కేర్ ఫార్మా కంపెనీ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటు చేసేందుకు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో రాజకీయ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు న్యాయవాదులు మేధావులు రైతులు ఫ్యాక్టరీ ఏర్పాటు ను తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున బారి కేడ్లు ఏర్పాటు చేసి, ఇంతమంది పోలీస్ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణణా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పంటలు పండే విలువైన భూములన్ని నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లనిచ్చేందుకు ఎవరు ముందుకు రావడం లేదని, మా ప్రాణాలైనా అర్పిస్తాం గానీ, ఫార్మా కంపెనీలు కొత్తగా పెట్టేందుకు మాత్రం తీవ్ర వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎంఎస్ ఎన్ కంపెనీ మూసివేయాలని 125 రోజులు దీక్ష చేస్తే పట్టించుకున్న పాపన పోని మీరు, మళ్లీ కొత్త కంపెనీ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు పాల్గొన్నారు.






