అంచెలంచెలుగా అన్ని ఇస్తాం : ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ష‌బ్బీర్ అలీ

by Ratna Kumari |

ప్రజల కిచ్చిన మాట ప్రకారం.. అంచెలంచెలుగా అన్ని ఇస్తామని, ఇందులో ఎంత మాత్రం అనుమానం అక్కర్లేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ భరోసానిచ్చారు.

అంచెలంచెలుగా అన్ని ఇస్తాం :  ప్ర‌భుత్వ స‌ల‌హాదారు  ష‌బ్బీర్ అలీ
X

దిశ‌, భిక్క‌నూరు : ప్రజల కిచ్చిన మాట ప్రకారం.. అంచెలంచెలుగా అన్ని ఇస్తామని, ఇందులో ఎంత మాత్రం అనుమానం అక్కర్లేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ భరోసానిచ్చారు. సోమవారం ఆయన భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు శామర్తి రతిలా గృహ ప్రవేశం చేయగా, సీఎం రేవంత్ రెడ్డి తరపున ఆమెకు బట్టలు కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఎన్ని బిల్లులు పడ్డాయంటూ ఆమెను ప్రశ్నించగా.. మూడు బిల్లులు మాత్రమే పడ్డాయని వివరించారు. ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చిన షబ్బీర్ ను ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు కొత్త పెన్షన్ల కోసం అడగ్గా.. ఖజానా ఖాళీ ఉండడం వల్లే అదొక్కటి ఇవ్వలేకపోతున్నామని తొందర్లోనే వాటిని కూడా ఇస్తామన్నారు.

బతుకమ్మ చీరలు నాణ్యతగా ఇచ్చామని, రంగు మార్చి మళ్లీ కొత్త బతుకమ్మ చీరలు అందించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. బస్సులో ఫ్రీ జర్నీ పథకం అమలు చేస్తున్నామని, గృహాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని కొత్త రేషన్ కార్డులు అందజేస్తున్నామని ఇందిరమ్మ ఇల్లులు నిర్మిస్తున్నామ‌ని.. ఇవన్ని ఇస్తుంటే వాటి గురించి మాత్రం చెప్పరన్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. కొద్ది వెనక ముందు అన్ని చేస్తామని ఇందులో ఏమాత్రం సందేహం అవసరం లేదని మహిళలకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఉమారాణి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగన్న గారి నరేందర్ రెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు తిరుపరి భీంరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రాణి రాజు, ఉప సర్పంచ్ గొల్లపల్లి వినోద్ గౌడ్, వీడీసీ అధ్యక్షులు మద్ది సూర్యకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగర్తి రమేష్ రెడ్డి, ఎండోమెంట్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, పెర్కరాజు ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం సాయిలు పాల్గొన్నారు.

Next Story