- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు : మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్దన్
దిశ, భిక్కనూర్ : రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లకు, బీఆర్ఎస్ ఎప్పుడు వ్యతిరేకించలేదని మాజీ ప్రభుత్వ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.

దిశ, భిక్కనూర్ : రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లకు, బీఆర్ఎస్ ఎప్పుడు వ్యతిరేకించలేదని మాజీ ప్రభుత్వ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం భిక్కనూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన పల్లపు ముత్తయ్య ఇటీవల మృతి చెందడంతో ఆయన ఇంటికి వెళ్లి కుమారుడు శంకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలియజేశారు. అనంతరం స్థానిక నాయకులతో సమావేశమై మాట్లాడారు. సీఎం రేవంత్ సర్కార్ పార్లమెంటులో బిల్లు పాస్ చేయించి ఎన్నికలకు వెళ్తే బాగుండేదన్నారు. అలా కాకుండా అసెంబ్లీలో చేసిన తీర్మానం ప్రకారం.. గవర్నర్ ఆమోదం లేకుండా పాస్ చేసిన బిల్లు వల్ల హైకోర్టు బ్రేక్ వేసిందన్నారు. తొందర పడి తప్పు చేసిన ప్రభుత్వం బిల్లు పాస్ కాకుండా కోర్టులో ప్రతిపక్ష పార్టీలు కేసు వేయించాయని దుష్ప్రచారం చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందె మహేందర్ రెడ్డి, తునికి వేణు, సిద్ధ రాంరెడ్డి ఉన్నారు.






