- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభివృద్ధికి, సంక్షేమానికి జూబ్లీహిల్స్ ఓటర్లు పట్టం కట్టారు : టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టారని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టారని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, నేతకు ఈ గెలుపును అంకితం చేస్తున్నానని మహేశ్ కుమార్ తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేదని మరోసారి రుజువైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనే ప్రజలు గుండు సున్నాతో బీఆర్ఎస్ భవిష్యత్తును ఇదివరకే ఖరారు చేశారని ఆయన పేర్కొన్నారు. బీసీ బిడ్డ నవీన్ యాదవ్‌ను గెలుపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, నాయకులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషికి నిదర్శనమని మహేష్ గౌడ్ అభినందించారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రజలు సంతృప్తి చెంది భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ను గెలిపించారని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
కంటోన్మెంట్ ఉప ఎన్నికల మాదిరిగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మద్దతునిచ్చారన్నారు. ఇది ప్రతిపక్షాలకు చెంపపెట్టు వంటి తీర్పు అని మహేష్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ విజయం జీ హెచ్ ఎం సీ ఎన్నికలకు నాంది పలికిందని, రానున్న జీ హెచ్ ఎం సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 కు పైగా సీట్లు గెలుచుకుని, మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఖాయమని మహేశ్ అన్నారు. కనీసం పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో కొనసాగే అవకాశం ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఈ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీకి జూబ్లీహిల్స్ ప్రజలు గట్టి హెచ్చరిక చేశారని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సఫలమయ్యారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తరపున టీపీసీసీ చీఫ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ పాల్గొన్నారు.






