విఠలేశ్వర ఆలయంలో చోరీ.. హుండీ పగలగొట్టిన దుండగులు.

by Bhanu |

మండలంలోని యంచ గ్రామంలో గల సుప్రసిద్ధ విఠలేశ్వర ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీ కి పాల్పడ్డారు.

విఠలేశ్వర ఆలయంలో చోరీ.. హుండీ పగలగొట్టిన దుండగులు.
X

దిశ, నవీపేట్ : మండలంలోని యంచ గ్రామంలో గల సుప్రసిద్ధ విఠలేశ్వర ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీ కి పాల్పడ్డారు. పోలీసులు మరియు స్థానికుల సమాచారం ప్రతిరోజు ఉదయం గుడికి వెళ్లి పూజలు చేసే పంతులు రంజిత్ ఆదివారం కూడా పూజల కొరకై గుడికి వెళ్ళగా గర్భగుడిలోని హుండీ మందిరం బయట ఉండడాన్ని చూసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సాయిలు కు సమాచారం ఇవ్వగా గ్రామస్తులు ఆలయానికి వచ్చి చూడగా హుండీ తోపాటు ఆలయంలో గల బీరువా తాళాలను పగలగొట్టబడి ఉండడంతో గ్రామస్తులు నవీపేట్ పోలీసులకు అందించగా నవీపేట్ ఎస్సై కే.వినయ్ ఘటన స్థలానికి చేరుకొని హుండీ మరియు బీరువాలను పరిశీలించారు. ఆరు తులాల వెండి ఆభరణాలతో పాటు నాలుగు వేల రూపాయల చోరీ అయినట్టు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కే.వినయ్ తెలిపారు.


Next Story