- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పల్లె ప్రగతి వాటర్ ట్యాంకర్ నిరుపయోగం
మండలంలోని నాగపూర్ గ్రామ పంచాయతీకి పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాల్లో మొక్కల పెంపకానికి, గ్రామంలో అత్యవసర నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా వాటర్ ట్యాంకును గత ప్రభుత్వ హయాంలో కేటాయించింది.

దిశ, కమ్మర్ పల్లి : మండలంలోని నాగపూర్ గ్రామ పంచాయతీకి పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాల్లో మొక్కల పెంపకానికి, గ్రామంలో అత్యవసర నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా వాటర్ ట్యాంకును గత ప్రభుత్వ హయాంలో కేటాయించింది. కానీ ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్ అధికారుల పర్యవేక్షణ లేక మూలన చేరింది. గ్రామ పంచాయతీకి సంబంధించిన వాటర్ ట్యాంకర్ గత కొన్ని నెలలుగా రోడ్డుపైనే పడి ఉంది. గ్రామ పంచాయతీకి సంబంధం లేకుండా కొందరు వాటర్ ట్యాంకర్ ను ఉపయోగించుకొని రోడ్డుపైనే వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం పై అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడం పట్ల గ్రామ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ట్యాంకర్ నిరుపయోగంగా ఉంచడం వల్ల శిథిలావస్థకు చేరి ప్రజా ధనం వృధా అవుతుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో రోడ్డు పక్కన నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకర్ ను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చి గ్రామంలో పారిశుధ్య పనులకు, నీటి సరఫరా కోసం వినియోగించాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు.






