- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం మత్తులో లారీ తో వీరంగం
మండల కేంద్రమైన మాచారెడ్డి క్రాస్ రోడ్డు (గజ్యానాయక్ తండా) లో మద్యం మత్తులో లారీ తో వీరంగం సృష్టించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

దిశ, మాచారెడ్డి : మండల కేంద్రమైన మాచారెడ్డి క్రాస్ రోడ్డు (గజ్యానాయక్ తండా) లో మద్యం మత్తులో లారీ తో వీరంగం సృష్టించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెడీ మేడ్ బట్టల దుకాణంలో జరిగిన గొడవ షాపు ను లారీ తో ధ్వంసం చేసే వరకు వెళ్లింది. స్థానికులు అడ్డుకుని పోలీసుల కు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రూనాయక్ తండా కు చెందిన మధు అనే వ్యక్తి స్థానిక ఓ రెడీ మేడ్ బట్టల దుకాణంలో కి వెళ్లి ప్యాంటు బేర మాడాడు. మూడు వందల ప్యాంటు ఆరు వందలా..? అంటూ గొడవకు దిగి కౌంటర్ పై ఉన్న డ్రెస్ లను కింద పడేసి దుకాణం యజమాని పై చేయి చేసుకున్నాడు. దీంతో స్థానికులు జోక్యం చేసుకుని సముదాయించి పంపించారు. కానీ మద్యం మత్తులో ఉన్న మధు అనే వ్యక్తి తన సొంత లారీ ని అతి వేగంగా తీసుకువచ్చి షాపు ధ్వంసానికి యత్నించాడు. అతని అమ్మ లారీ కి అడ్డు రావడం తో ఆగి పోయాడు. దీంతో స్థానికులు లారీ నుంచి కిందకి దింపి పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తి మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం స్థానికుల్లో గుబులు రేపింది.






