- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుడే పుట్టిన నవజాత బాలుడిని ఎండలో వదిలేసిన వైనం..!
అప్పుడే పుట్టిన నవజాత బాలుడిని ఎండలో వదిలేసిన ఘటన బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీలో చోటు చేసుకుంది.

దిశ, బాన్సువాడ : అప్పుడే పుట్టిన నవజాత బాలుడిని ఎండలో వదిలేసిన ఘటన బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మదీనా కాలనీ నివాస ప్రాంతంలో ఎవ్వరికీ కనిపించని ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు నవజాత శిశువును వదిలివెళ్లారని స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, వార్డు కౌన్సిలర్ భర్త ఫెరోజ్, మాజీ కౌన్సిలర్ భర్త అమర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాలనీ వాసులు సకాలంలో స్పందించడంతో శిశువు ప్రాణాలు దక్కాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వచ్చే వరకు స్థానిక ప్రజలు శిశువుకు రక్షణ కల్పించడంతో ప్రాణాపాయం తప్పింది. డాక్టర్లు పరీక్షించి శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం శిశువును శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు.






