- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్మూర్ లో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు..
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని కోటార్మూర్ ఏరియాలోని గేదె జాతి, గోజాతి పశువులన్నింటికీ గాలికుంటు వ్యాధి సోకకుండా 220 పశువులకు వ్యాధి నివారణ

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని కోటార్మూర్ ఏరియాలోని గేదె జాతి, గోజాతి పశువులన్నింటికీ గాలికుంటు వ్యాధి సోకకుండా 220 పశువులకు వ్యాధి నివారణ టీకాలను పశువైద్యాధికారులు గురువారం వేశారు.ఈ కార్యక్రమాన్ని టెక్నికల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ గంగాధరయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోటార్మూర్ ప్రాంతంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ఎలా జరుగుతోంది అనే విషయాన్ని పరిశీలించారు. అక్కడి పాడి రైతులతో మాట్లాడి పశువైద్యం అందుతున్న విధివిధానాల పట్ల ఎంక్వయిరీ చేశారు. రాబోయే రోజుల్లో చేయబోయే గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం పట్ల పశువైద్య సిబ్బందికి అసిస్టెంట్ డైరెక్టర్ గంగాధరయ్య సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య ఆర్మూర్ మండల అధికారి లక్కం ప్రభాకర్, సిబ్బంది రాజేశ్వర్, శ్రీనివాస్ గౌడ్, రాధ, దివ్య, అనిత, శ్రీనివాస్, నాగార్జున పాల్గొన్నారు.






