- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొక్కజొన్న కంకుల చాటున యూరియా బస్తా చోరీ
మొక్కజొన్న కంకుల చాటున యూరియా బస్తాను ఇద్దరూ యువకులు బైక్ పై ఎత్తుకెళ్లిన వింత ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

మొక్కజొన్న కంకుల చాటున యూరియా బస్తా చోరీ
- వ్యవసాయ బావి వద్ద బస్తా వేసి ఇంటికి వెళ్లొచ్చేసరికి మాయం
- వాట్సాప్ గ్రూపులో ఫొటో వైరల్
- విషయం తెలిసి రైతుకు తిరిగి ఇచ్చిన యువకులు
దిశ,భిక్కనూరు : మొక్కజొన్న కంకుల చాటున యూరియా బస్తాను ఇద్దరూ యువకులు బైక్ పై ఎత్తుకెళ్లిన వింత ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన తక్కల్ల గంగారెడ్డికి యూరియా లభించకపోవడంతో తనకు తెలిసిన వారి వద్ద నుంచి ఒక సంచి యూరియా బస్తాను చేబదులుగా తీసుకొని తన మొక్కజొన్న పంటకు చల్లడం కోసం వ్యవసాయ బావి వద్ద వేశాడు. ఈ క్రమంలో పనిమీద ఇంటికి వెళ్లి తిరిగి బావి వద్దకు వచ్చే సరికి యూరియా బస్తా మాయమైంది. దీంతో షాక్ కు గురైన రైతు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నాడు. చివరకు చేసేదేమీలేక ఇంటికి వెళ్తూ తన తోటి మిత్రులకు విషయం తెలిపాడు. దీంతో, గుర్తుతెలియని యువకులు ఇద్దరూ మొక్కజొన్న కంకులను టోల్ ప్లాజా వైపు బైక్ పై పెట్టుకొని వెళ్లారని వారు చెప్పడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్లాజా వద్దకు చేరుకొని సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా, సంచిలో యూరియా బస్తాను వేసుకొని వాటిపై మొక్కజొన్న కంకులను కనబడకుండా నింపుకొని వాటి కింద యూరియా బస్తాను వేసుకొని వెళ్లడాన్ని గుర్తించారు. సీసీ ఫుటేజ్ ను డౌన్ లోడ్ చేసుకొని వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఇష్యూ తెగ వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న యువకులు చోరీ చేసి తీసుకెళ్లిన యూరియా బస్తాను వాపస్ తీసుకొచ్చి రైతుకు అందజేసి క్షమాపణ కోరారు.






