- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ ప్రతినిధి, నిజామాబాద్ః నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొండూరు గ్రామ శివారులోని ఓ పొలంలో గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైంది. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటాన్ని బట్టి చూస్తే వారం రోజుల క్రితమే మృతిచెంది ఉండవచ్చని గ్రామస్తులు తెలిపారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం గ్రామంలో 42 నుండి46 ఏళ్ల మధ్య వయసులో ఉన్న ఓ మతిస్థిమితం లేని వ్యక్తి తలపై పెద్దగా జుట్టుతో, ఒంటిపై నిండా బట్టలు లేకుండా తిరిగాడని గ్రామస్థులు చెపుతున్నారు. బహూశా పొలంలో లభ్యమైన డెడ్ బాడీ అదే వ్యక్తిదే అయి ఉండొచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నట్లు రూరల్ ఎస్ ఐ ఆరీఫ్ తెలిపారు. ఆకుల కొండూరు మాజీ సర్పంచ్ కు చెందిన పొలంలో కుళ్లిపోయిన స్థితిలో డెడ్ బాడీ లభ్యమైంది. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.






