- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తూనికలు కొలతల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు
దిశ, కమ్మర్ పల్లి : మండలంలో తూనికలు కొలతల శాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా అధికారి మహమ్మద్ సుజాత్ అలి తెలిపారు. పలు కిరాణా షాప్, చికెన్ షాప్,

X
దిశ, కమ్మర్ పల్లి : మండలంలో తూనికలు కొలతల శాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా అధికారి మహమ్మద్ సుజాత్ అలి తెలిపారు. పలు కిరాణా షాప్, చికెన్ షాప్, రేషన్ షాప్, హార్డ్ వేర్ తదితర దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. ప్రతివ్యాపారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. నిర్ణీత కాలపరిమితి పూర్తయిన వెంటనే తిరిగి కాటాలకు అనుమతి తీసుకోవటం, తూకం రాళ్లకు ముద్రలు వేయించుకోవటం చేయాలన్నారు. నిర్ణీత గరిష్ఠ ధరలు (ఎంఆర్పీ) కంటే ఎక్కువ విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ముందు ముందు తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు. ఆయన వెంట సురేందర్ రావు, సత్యనారాయణ, లింగారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






