- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kamareddy : భార్య మరణాన్ని తట్టులేక ఆసిడ్ తాగిన భర్త
భార్య మరణాన్ని తట్టులేక ఆసిడ్ తాగి సూసైడ్ భర్త(Husband Suicide) చేసుకున్న ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా(Nizamabad District)లో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : భార్య మరణాన్ని తట్టులేక ఆసిడ్ తాగి సూసైడ్ భర్త(Husband Suicide) చేసుకున్న ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా(Nizamabad District)లో చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో భార్య మరణాన్ని తట్టుకోలేని భర్త.. తాను కూడా ప్రాణాలు తీసుకున్న ఘటన బిచ్కుందలో జరిగింది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద(Bichkunda)కు చెందిన సునీల్, జ్యోతిలకు గత ఏడాది వివాహం జరుగగా.. జ్యోతి ప్రస్తుతం 7 నెలల గర్భవతి. అయితే 10 రోజుల కింద సీమంతం పూర్తి చేసుకొని పుట్టింటి నుంచి భర్త బైక్ పై శనివారం అత్తవారింటికి వస్తుండగా.. అతి వేగం వలన బైక్ మీది నుంచి జారీ జ్యోతి కింద పడి తీవ్ర గాయాలు అయ్యాయి.
చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా భార్య మృతిని తట్టుకోలేని సునీల్.. ఆదివారం తెల్లవారుజామున యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ రోడ్డు ప్రమాదం ఇద్దరు నవ దంపతుల జీవితాన్ని బలి తీసుకోవడంతో రెండు కుటుంబాలు తీరని శోకంలో మునిగిపోయాయి.






