కలెక్టరేట్ లో ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణం

by Naveena |

జిల్లా టీఎన్జీవోస్, టీజీవో సంఘాల ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నూతన సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహించారు.

కలెక్టరేట్ లో ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణం
X

దిశ, కామారెడ్డి : జిల్లా టీఎన్జీవోస్, టీజీవో సంఘాల ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నూతన సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అందరికీ శుభాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మహిళా పండితుల పంచగా శ్రవణం ప్రశంసిస్తూ.. ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన టిఎన్జీవోస్, టీజీఓ సంఘాలను అభినందించారు. పంచాంగ శ్రవణం అనంతరం ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ నరాల వెంకట్ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దేవేందర్, సాయి రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ఎం నాగరాజు, సహధ్యక్షులు ఎం చక్రధర్, కోశాధికారి ఎం దేవరాజు, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, జాయింట్ సెక్రెటరీ గణేష్, కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Next Story