- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాల్య వివాహం చేసుకుంటే రెండేళ్లు జైలు శిక్ష : ఐసీడీఎస్ ఏసీడీపీఓ జ్ఞానేశ్వరి
దిశ, కమ్మర్ పల్లి : బాల్య వివాహం చేసుకుంటే రెండేళ్లు జైలు శిక్ష తప్పదని ఐసీడీఎస్ ఏసీడీపీఓ జ్ఞానేశ్వరి హెచ్చరించారు. కమ్మర్ పల్లి మండల కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిక్షణ విభాగం

దిశ, కమ్మర్ పల్లి : బాల్య వివాహం చేసుకుంటే రెండేళ్లు జైలు శిక్ష తప్పదని ఐసీడీఎస్ ఏసీడీపీఓ జ్ఞానేశ్వరి హెచ్చరించారు. కమ్మర్ పల్లి మండల కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిక్షణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కమ్మర్ పల్లి, ఏర్గట్ల గ్రామ, మండల స్థాయి అధికారులకు బాల్య వివాహాల నిరోధక చట్టంపై శిక్షణ ఇచ్చారు. తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐసీడీఎస్ ఏసీడీపీఓ జ్ఞానేశ్వరి, ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, ఏర్గట్ల ఎంపీడీవో వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. 2006లో బాల్య వివాహ నిషేద చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టిందని.. ఈ చట్టం ప్రకారం బాలుడికి 21 సంవత్సరాలు, బాలికకు 18 సంవత్సరాలు నిండకుండా వివాహం జరిపితే అది చట్ట ప్రకారం నేరం అవుతుందని అన్నారు. బాల్య వివాహం చేసుకుంటే ఈ చట్టం ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా రెండు శిక్షలను విధించవచ్చు అని తెలిపారు. బాల్య వివాహం జరిపితే దీనికి బెయిల్ లభించదని తెలిపారు. బాల్య వివాహాలకు ప్రోత్సహించిన వారికి కూడా ఇదే శిక్ష విధించబడుతుందని తెలిపారు. బాల్య వివాహాలు జరిగితే చిన్నవయసులోనే గర్భం దాల్చితే మాతా శిశు మరణాలు పెరుగుతాయని తెలిపారు. బాల్యవివాహాల వల్ల సామాజికంగా, ఆర్థికంగా, శారీరకంగా మానసికంగా ఎదుగుదల తగ్గిపోయి అన్ని రకాల తల్లి బిడ్డలకి ప్రమాదకరమని తెలిపారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరిగితే అంగన్ వాడి కార్యకర్తలు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ కార్యదర్శులు తెలుసుకొని ముందే సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ గంగ హంస, సూపర్వైజర్ సరస్వతి, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్ వైజర్ బిక్ సింగ్, డీసీపీఓ చైతన్యకుమార్, ఏర్గట్ల ఎంపీఓ చరణ్ కుమార్, అంగన్ వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.






