ఈజీ మనీ కోసం దొంగతనాల బాట పట్టిన ఇద్దరు దొంగల అరెస్ట్

by Nallavelli.Anjaneyulu |

దిశ, నిజామాబాద్ అర్బన్ : మ‌ద్యం, సిగరెట్, గుట్కాలకు బానిసలై దొంగలుగా మారిన ఇద్దరు దొంగలను నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ఇస్లాంపుర, ఖోజా కాలనీకి చెందిన అత్తర్ బేగ్, అలియాస్

ఈజీ మనీ కోసం దొంగతనాల బాట పట్టిన ఇద్దరు దొంగల అరెస్ట్
X

దిశ, నిజామాబాద్ అర్బన్ : మ‌ద్యం, సిగరెట్, గుట్కాలకు బానిసలై దొంగలుగా మారిన ఇద్దరు దొంగలను నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ఇస్లాంపుర, ఖోజా కాలనీకి చెందిన అత్తర్ బేగ్, అలియాస్ అత్తు , షేఖ్ అజ్మద్ అలియాస్ ఆహూ లను అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సీఐ రఘుపతి తెలిపారు. వన్ టౌన్ సీఐ రఘుపతి పర్యవేక్షణలో వన్ టౌన్ ఎస ఐ జి.మహేశ్ దర్యాప్తు జరిపి చేధించిన ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. అక్టోబర్ 31 న నగరంలోని ఎరుకలవాడ లోని ఒక ఇంట్లో ఇద్దరు నిందితులు చొరబడి బీరువాను పగుల గొట్టి బంగారు ఆభరణాలు, రూ. 1500 ల నగదును దోచుకుని వెళ్లారు. దొంగలించిన సొమ్మును విక్రయించడానికి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గంజ్ మార్కెట్లోకి వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించడంతో వారిని పట్టుకొని విచారించారు. వారి నుంచి బంగారు ముక్కు పుడక, ఉంగరం, వెండి కడియాలు, ఒత్తులు, వివో 1902 మోడల్ బ్లూ కలర్ స్మార్ట్ ఫోన్ తో పాటు రూ. 1500 లను నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ రఘుపతి తెలిపారు. నిందితులిద్దరిపై ఇదివరకే పలు దొంగతనాల కేసులు, హత్యాయత్నం కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిలో అత్తర్ బైగ్ అనే నిందితుడు నెలన్నర క్రితమే జైలు నుండి విడుదలైనట్లు తెలిపారు. దొంగతనం జరిగిన 48 గంటల్లోనే కేసును చేధించడంతో ముఖ్య పాత్ర పోషించిన వన్ టౌన్ ఎస్ ఐ జి. మహేశ్, ఏఎస్ఐ షకీల్, కానిస్టేబుళ్లు గంగారం, ప్రభురాజ్ లను నిజామాబాద్ ఏసీపీ ఎల్. రాజా వెంకట్ రెడ్డి అభినంధించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు నేరస్తులు మందు, సిగరెట్, గుట్కా వంటి చెడు అలవాట్లకు బానిసై ఈజీ మనీ కోసం దొంగతనాల బాటను ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒంటరిగా కనిపించే వారిని బెదిరించడం, వారిని కొట్టి వారి దగ్గరున్న డబ్బులు, విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు దొంగిలించడం వంటి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇళ్లలో దొంగతనాలకు కూడా చేసి దొంగిలించిన డబ్బును తమ జల్సాలకు, చెడు అలవాట్లకు ఖర్చు చేస్తారని పోలీసులు పేర్కొన్నారు.

Next Story