చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి

by Elthuri vijay kumar |

మండల కేంద్రంలోని గాంధీనగర్ కు చెందిన ఇద్దరు యువకులు చేపల వేటకు వెళ్లి కరెంట్ షాక్ కు గురై మృతి చెందారు.

చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి
X

చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి

దిశ, కమ్మర్ పల్లి: మండల కేంద్రంలోని గాంధీనగర్ కు చెందిన ఇద్దరు యువకులు చేపల వేటకు వెళ్లి కరెంట్ షాక్ కు గురై మృతి చెందారు. గ్రామానికి చెందిన కొండపల్లి లక్ష్మణ్ (40), చిత్తారి నర్సు (28) బుధవారం జాతీయ రహదారి 63 పక్కనగల చౌటా మోటా కాలువలో చేపల వేటకు వెళ్లి 11 కేవీ హైటెన్షన్ వైర్ నుంచి విద్యుత్ సరఫరా చేసి చేపలు పడుతుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ కు గురయ్యారు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. యువకుల మృతితో గాంధీనగర్ లో విషాదం అలుముకుంది.

Next Story